దేవ్ గిల్ నేతత్వంలో దేవ్‌గిల్ ప్రొడక్షన్స్ నుంచి ”అహో విక్రమార్క’ అనే తొలి ప్రాజెక్ట్ రాబోతోంది. తాజాగా ఈ చిత్ర టీజర్‌ను రిలీజ్ చేశారు. టీజర్ లాంచ్ ఈవెంట్లో దేవ్‌గిల్ మాట్లా డుతూ,’రాజమౌళి ‘మగధీర’తో తెలుగు పరిశ్రమలో నాకు మంచి పేరు ఇచ్చారు. రమా నాకు తల్లిలా సపోర్ట్ ఇచ్చారు. వారి వల్లే ఈ రోజు హీరోగా చిత్రాన్ని తీశాను. నన్ను ఇంత వరకు విలన్‌గా చూశారు. కానీ ఈ సినిమాతో మీ అందరికీ సర్ప్రైజ్ ఇవ్వ బోతోన్నాను. త్రికోటికి చాలా పెద్ద విజన్ ఉంది. మా టీజర్ అందరికీ నచ్చిందని ఆశిస్తున్నాను. త్వరలోనే పాటలు కూడా రిలీజ్ చేస్తాం’ అని తెలిపారు. ‘మా కల నెరవేరబోతోంది. మా ప్రొడక్షన్ నుంచి వస్తున్న మొదటి చిత్రం చాలా కొత్తగా ఉంటుంది. టెక్నికల్‌గా ఈ సినిమా అద్భుతంగా ఉంటుంది’ అని నిర్మాత, దేవ్‌గిల్ భార్య ఆర్తి చెప్పారు. దర్శకుడు పేట త్రికోటి మాట్లాడుతూ, ‘మగధీర నుంచి దేవ్‌గిల్‌తో పరిచయం ఏర్పడింది. హీరోగా ఓ సినిమా చేద్దామని ఆయన చెబుతూనే ఉండేవారు. పోలీస్ కథతో ఈ సినిమాని స్టార్ట్ చేశాం. తెలుగు, హిందీ భాషల్లో ఒకేసారి షూటింగ్ చేశాం. సినిమా తప్పకుండా అలరిస్తుంది’ అని అన్నారు. ‘ఈ సినిమాలో చాలా స్ట్రాంగ్ కంటెంట్ ఉంది. ఇలాంటి ప్రాజెక్ట్‌లో భాగమైనందుకు ఆనందంగా ఉంది’ అని హీరోయిన్ చిత్రా శుక్లా చెప్పారు.