న్యూఢిల్లీ : ప్రముఖ ఫిన్‌టెక్ సంస్థ ఫోన్‌పేలో కృత్రిమ మేధా (ఏఐ) ఆ సంస్థ ఉద్యోగులపై తీవ్ర ప్రభావం చూపింది. ఫోన్‌పే తన కస్టమర్ సపోర్ట్ స్టాఫ్ కార్యకలాపాల్లో 90 శాతం ఎఐ చాట్‌బాట్‌లను వాడుతోంది. దీంతో గత ఐదేళ్లలో కస్టమర్ సపోర్ట్ విభాగంలో 60 శాతం మంది ఉద్యోగులకు ఉద్వాసన పలికింది. గతంలో ఈ విభాగంలో ఉన్న 1,100 మంది ఉద్యోగులను 400కు పరిమితం చేసింది.