కాంగ్రెస్ పార్టీ ఎన్నికల కార్యాలయాన్ని ప్రారంభించిన ఏఐసీసీ కార్యదర్శి తిలక్

నవతెలంగాణ – వేములవాడ
వేములవాడ పట్టణంలోని రెండో బైపాస్ లో మహాలింగేశ్వర ఫంక్షన్ హాల్ లో శుక్రవారం ఉదయం వేములవాడ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల కార్యాలయాన్ని ఏఐసీసీ కార్యదర్శి ప్రారంభించారు. అనంతరం ఆయన కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడారు. రోజురోజుకీ కాంగ్రెస్ పార్టీకి వస్తున్న ఆదరణ చూసి వేములవాడ నియోజకవర్గ వ్యాప్తంగా బిఆర్ఎస్ పార్టీ నుండి భారీ సంఖ్యలో కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారు.ఈ ఎన్నికల్లో బిఆర్ఎస్ ను ఓడించేందుకు ప్రజలందరూ సిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు.కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డాక ఆరు గ్యారెంటీగా అమలు చేయడంతో పాటు, పార్టీలకు అతీతంగా సంక్షేమ పథకాలు అందేలా కృషి చేస్తామన్నారు. అనంతరం ఆది శ్రీనివాస్ మాట్లాడుతూ రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలుపే లక్ష్యంగా ప్రతి ఒక్క కార్యకర్త బూత్ స్థాయి నుండి ఒక సైనికునీ లాగా పని చేయాలని కోరారు. గమ్యం చేరే దాకా ఈ 20 రోజులు నాకోసం పోరాడాలని పిలుపునిచ్చారు. నాంపల్లి లో ఖాళీ అయిన కారు.. హస్తం పార్టీ జోరు ఆది నాయకత్వంలో 150 మంది బిఆర్ఎస్ , బిజెపి కార్యకర్తలు కాంగ్రెస్ లో చేరిక వేములవాడ మున్సిపల్ పరిధిలోని నాంపల్లి లో బిఆర్ఎస్ , బిజెపి పార్టీలు ఖాళీ అయ్యాయి. శుక్రవారం సుమారు 150 మందికి పైగా బిఆర్ఎస్, బిజెపి పార్టీ కార్యకర్తలు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఆది శ్రీనివాస్ ఏఐసీసీ కార్యదర్శి సమక్షంలో, వారినాయకత్వంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. వారందరికీ శ్రీనివాస్ పార్టీ కండువా లు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. వేములవాడ పట్టణానికి చెందిన టిఆర్ఎస్ నాయకుడు బొందిల మహేష్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షులు చంద్రగిరి శ్రీనివాస్ గౌడ్, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు సాగర వెంకటస్వామి, సంఘ స్వామి యాదవ్, కనికరపు రాకేష్, వస్తాది కృష్ణ ప్రసాద్ గౌడ్, చిలక రమేష్, కూరగాయల కొమరయ్య, వామపక్ష నాయకులు వేణు, రాములు, జేఏసీ నాయకులు కనకయ్య తో పాటు తదితరులు పాల్గొన్నారు.