నవతెలంగాణ – శాయంపేట
మండలంలోని మాందారిపేట గ్రామానికి చెందిన బడుగు శ్రీలక్ష్మి ప్రథమ వర్ధంతిని పురస్కరించుకొని సోమవారం దివ్యాంగులకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. హనుమకొండ పట్టణంలోని అతిధి దివ్యాంగుల ఆశ్రమంలో దివ్యంగులకు శ్రీ లక్ష్మీ కుమార్తెలు ప్రమీల, రమాదేవి, సుజాత, విజయ, సరితలు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా అతిధి దివ్యాంగుల ఆశ్రమ నిర్వాహకురాలు వారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. కార్యక్రమంలో సత్యనారాయణ, మహాదేవ, శ్రీధర్ పాల్గొన్నారు.