ఎయిడ్స్‌ వ్యాధిపై అవగాహన అవసరం

– ఏయూ డీన్‌ విజరు కుమార్‌
నవతెలంగాణ-ఘట్కేసర్‌
ఎయిడ్స్‌ రహిత సమాజ స్థాపనకు అందరూ కషి చేయాలని అనురాగ్‌ యూనివర్సిటీ డీన్‌ విజరు కుమార్‌ అన్నారు. మండలంలోని వెంకటాపూర్‌ గ్రామంలోని అనురాగ్‌ యూనివర్సిటీలో రాష్ట్ర ఎయిడ్స్‌ కంట్రోల్‌ సొసైటీ సేవా పథకం ఆధ్వర్యంలో యూనివర్సిటీలో జాతీయ సేవా పథకం సంయుక్తంగా హెచ్‌ఐవీ, ఎయిడ్స్‌ వ్యాధి నిర్మూలనపై అవగాహన కార్యక్రమం నిర్వహించా రు. ఈ కార్యక్రమాన్ని అనురాగ్‌ యూనివర్సిటీ డీన్‌ స్కూల్‌ ఆఫ్‌ ఇంజినీరింగ్‌ డాక్టర్‌ వి.విజరు కుమార్‌, ఎన్‌ఎస్‌ఎస్‌ఎల్‌ ప్రోగ్రాం కోఆర్డినేటర్‌ డాక్టర్‌ మల్లేష, రాష్ట్ర ఎయిడ్స్‌ కంట్రోల్‌ సొసైటీ అడిషనల్‌ డైరెక్టర్‌ డాక్టర్‌ ప్రసాద్‌, కాకతీయ యూనివర్సిటీ రిటైర్డ్‌ ప్రొఫెసర్‌ నరసింహరావు, అసిస్టెంట్‌ డైరెక్టర్‌ యూత్‌ అఫైర్స్‌ టీసీఏసీఎస్‌ హైదరాబాద్‌ రమేష్‌, ఎన్‌ఎస్‌ఎస్‌ యూనిట్‌ ప్రోగ్రాం ఆఫీసర్స్‌తో కలిసి కార్యక్రమాన్ని ప్రారంభించా రు. ఈ సందర్భంగా డిన్‌ విజరు కుమార్‌ మాట్లాడుతూ .. యుక్త వయసు వారు సరైన అవగాహన లేకపోవడం తో ఈ మహమ్మారి బారినపడి జీవితాలను నాశనం చేసుకుంటున్నారని తెలిపారు. ఎయిడ్స్‌ లాంటి వ్యాధుల పట్ల విద్యార్థులకు అవగాహన కల్పించడం చాలా అవసరం అని పేర్కొన్నారు. విద్యార్థులకు రాష్ట్ర కంట్రోల్‌ సొసైటీ తరఫున అడిషనల్‌ డైరెక్టర్‌ డాక్టర్‌ పి ప్రసాద్‌, కాకతీయ యూనివర్సిటీ రిటైర్డ్‌ ప్రొఫెసర్‌ నరసింహారావు లు తమ కళాశాల విద్యార్థులకు అవగాహన కల్పించడం మంచి పరిణామన్నారు. ఈ సందర్భంగా పుట్టుకతోనే హెచ్‌ఐవీతో బాధపడుతున్న 24 ఏండ్ల యువతి ఈ సమాజంలో తాను బాధపడుతున్న బాధలు, అనుభవాల ను విద్యార్థులకు వివరించారు. ఈ సందర్భంగా యూని వర్సిటీ లెవెల్‌ రెడ్‌ రిబ్బన్‌ క్లబ్‌ యాక్టివిటీస్‌ పోస్టర్‌ మేకింగ్‌ సాత్విక, ఎం. మానస, ఎలక్యూషన్‌ కాంపిటీషన్‌ విజేతలు చేతన, కుసుం, రెడిబన్‌ క్లబ్‌ స్టూడెంట్‌ బ్రాండ్‌ అంబాసిడర్స్‌ ఎం. సింధూ, డి. మనీషాలను అభినందిం చారు. ఈ కార్యక్రమంలో నాలుగు యూనిట్ల ప్రోగ్రామ్‌ ఆఫీసర్లు డాక్టర్‌ నవీన్‌, చిన్ని శ్రీనివాసరావు, మధుకర్‌, కిరణ్‌ కుమార్‌ పాల్గొన్నారు.