రమాబాయి జయంతి సందర్భంగా నివాళులర్పించిన ఐద్వా జిల్లా కమిటీ 

నవతెలంగాణ – కంఠేశ్వర్ 
బాబా సాహెబ్ అంబేద్కర్ సతీమణి రమాబాయి జయంతి సందర్భంగా విగ్రహానికి ఐద్వా జిల్లా కమిటీ ఆధ్వర్యంలో శుక్రవారం పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా జిల్లా కార్యదర్శి సుజాత మాట్లాడుతూ..రమాబాయి త్యాగం మరచిపోనిది ఈరోజు బాబా సాహెబ్ అంబేద్కర్  మనదేశంతో పాటు ప్రపంచ దేశాలు కూడా గుర్తించుకునే విధంగా బాబాసాహెబ్ అంబేద్కర్ నిలిచారు అంటే వారి సతీమణి తన సర్వస్వం త్యాగం చేసి సహకరించడం వల్ల అని అన్నారు.  ఈరోజు చరిత్రలో నిలిచినటువంటి ఘనత అంబేద్కర్ కి దక్కింది మన పూర్వీకులు చేసిన త్యాగాలను గుర్తించుకొని వారు సమాజంలో నిలిచి పోవడానికి ప్రోత్సహించిన అటువంటి వారిని కూడా వారి త్యాగాన్ని గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం మనకు ఉంది. ఎందరో మహానీయుల జీవితాన్ని త్యాగం చేసి మనకి ఇచ్చినటువంటి భారత రాజ్యాంగాన్ని కాపాడుకుంటూ వారి త్యాగాలను గుర్తు చేసుకొని మన వంతుగా కూడా మనం సహకరిస్తూ ముందుకు వెళ్లాల్సిన అవసరం ఉందని అన్నారు. ఈ కార్యక్రమంలో ఐద్వా జిల్లా అధ్యక్షురాలు అనిత, జిల్లా కమిటీ సభ్యురాలు మాధవి, తదితరులు పాల్గొన్నారు.