స్థానిక సమస్యలపై కలెక్టర్ కు వినతిపత్రం అందజేసిన ఐద్వా 

Aidwa presented a petition to the collector on local issuesనవతెలంగాణ – కంటేశ్వర్ 
స్థానిక సమస్యలపై నిజామాబాద్ జిల్లా కలెక్టర్కు సోమవారం ఐద్వా జిల్లా కమిటీ ఆధ్వర్యంలో వినతి పత్రం అందజేశారు. వినతి పత్రం ఇవ్వడం జరిగింది ఈ సందర్భంగా ఐద్వా జిల్లా కార్యదర్శి సుజాత  మాట్లాడుతూ.. ముఖ్యంగా నాగారంలో స్మశాన వాటిక రోడ్ల మరమ్మత్తులు, వీధిలైట్ల సమస్యలు ఉన్నాయి. గతంలో చాలా సార్లు మున్సిపల్ కమిషనర్ ని కలిసి వినతి పత్రం అందజేయడం జరిగింది. స్మశాన వాటికకు నిధులు కేటాయించామని పనులు ప్రారంభిస్తారని గతంలో చెప్పడం జరిగింది కానీ ఇప్పటివరకు కూడా ఎలాంటి పనులు ప్రారంభించలేరు అని తెలియజేశారు. అలాగే వర్షాకాలంలో ఎవరైనా చనిపోతే దహనం చేసేటప్పుడు అనేక ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది అని తెలియజేశారు. ఎందుకంటే అక్కడ ఉన్న స్మశాన వాటికకు ప్రహరీ గోడ గాని రేకుల షెడ్డు గాని నీటి సౌకర్యంగానీ ఎలాంటి సౌకర్యాలు లేకపోవడం వల్ల ప్రజలు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అలాగే రోడ్లపై విపరీతమైన గుంతలు ఉండడం వల్ల ఈ వర్షాకాలం ఆ గుంతలు కనిపియ్యక చాలామంది పడిపోతున్నారు.ఈ ప్రాంతం లో యాక్సిడెంట్లు అవుతున్నాయి, వీధిలైట్లు కూడా లేకపోవడం వల్ల బస్తివాసులు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కాబట్టి వీటిపై ప్రత్యేక దృష్టి పెట్టాలని కలెక్టర్ కి  ఐద్వా తరఫున విజ్ఞప్తి చేశారు. లేదంటే స్థానిక సమస్యలు పరిష్కరించేంతవరకు పోరాటాలు నిర్వహిస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో నగర నాయకురాలు రేఖ, స్థానికులు సత్యశీల, జ్యోతిబాయ్, రేఖ భాయ్, ఫిరంగి భాయ్, సునీత తదితరులు పాల్గొన్నారు.