ఏఐవైఎఫ్ మండల స్థాయి క్రికెట్ బహుమతుల ప్రధానోత్సవం

నవతెలంగాణ – వలిగొండ రూరల్
మండల పరిధిలోని అరూరు గ్రామంలో ఏఐవైఎఫ్ వలిగొండ మండల సమితి ఆధ్వర్యంలో భగత్ సింగ్ రాజ్ గురు, సుఖ్ దేవ్ ల 93వ వర్ధంతిని పురస్కరించుకుని ఏర్పాటు చేసిన క్రీడోత్సవాల ముగింపు బహుమతుల ప్రధానోత్సవ కార్యక్రమం సుద్దాల సాయికుమార్ అధ్యక్షతన ఆదివారం జరిగింది. ఈ ప్రధానోత్సవ కార్యక్రమానికి ఏఐవైఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె ధర్మేంద్ర, సిపిఐ జిల్లా కార్యదర్శి గోదా శ్రీరాములు ముఖ్య అతిథిలుగా హాజరై క్రికెట్ పోటీల్లో గెలుపొందిన లింగరాజు పల్లి క్రికెట్ టీం కి మొదటి బహుమతి, అరూర్ టీం కు  రెండవ బహుమతి అందజేశారు. ఈ సందర్భంగా ఏఐవైఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కే ధర్మేంద్ర మాట్లాడుతూ క్రీడలకు  రాష్ట్ర ప్రభుత్వ సహకారం పూర్తిగా అవసరమని, గ్రామీణ స్థాయి నుండే క్రీడలను ప్రోత్సహించి అధిక నిధులు కేటాయించాలన్నారు.ప్రస్తుత సమాజంలో యువత, విద్యార్థులు కేవలం పుస్తకాలకు మాత్రమే పరిమితమైన సమయంలో, యువతలో ఉన్న క్రీడా నైపుణ్యాన్ని వెలికితీసేందుకు  ఏ ఐ వై ఎఫ్ క్రీడలు నిర్వహించడం హర్షించదగ్గ విషయమని వారు అన్నారు.ఈ కార్యక్రమంలో సీపీఐ మండల కార్యదర్శి పోలె పాక యాదయ్య, జిల్లా అధ్యక్ష కార్యదర్శులు ఎల్లంకి మహేష్, పెరబోయిన మహేందర్, సీపీఐ జిల్లా కౌన్సిల్ సభ్యులు బబ్బురి శ్రీధర్, నాయకులు మేడి దేవేందర్, మారుపాక వెంకటేష్,ఎం.డి నయీమ్, బహుమతి దాత చిలకమర్రి నారాయణ, దుప్పల్లి జావిద్, జక్కడి శ్రీనివాసరెడ్డి, రవ్వ శివ, జోలం మల్లేష్, మహేష్, మెట్టు సంతోష్, మారుపాక లోకేష్, తదితరులు పాల్గొన్నారు.