నవతెలంగాణ-డిచ్ పల్లి
అఖిల భారత రైతు కూలీ సంఘం ఎఐకెఎంఎస్ డిచ్ పల్లి మండల కమిటీ ఆధ్వర్యంలో సోమవారం తహసిల్దార్ శ్రీనివాస్ రావు కు సమస్యలతో కుడిన వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా మండల అధ్యక్షులు దేవస్వామి మాట్లాడుతు ఖరీఫ్ సీజన్ ప్రారంభమైందని రైతులకు కావాల్సిన అన్ని రకాల ఎరువులు, విత్తనాలు ప్రభుత్వమే ఎస్సి ఎస్టీ రైతులకు ఉచితంగాను, సన్న చిన్న కారు రైతులకు సబ్సిడీ పైన అందించాలని డిమాండ్ చేశారు. ఆర్బిఐ సూచన మేరకు అన్ని రకాల బ్యాంక్ లు 18% శాతం పంట రుణాలు ఇవ్వాలని, గతంలో అకాల వర్షాల కారణంగా పంట నష్టపోయిన రైతులను ప్రభుత్వమే ఆదుకోవాలని ఆయన అన్నారు. రైతులకు ప్రతి ఏటా పెట్టుబడి వ్యయం పెరుగుతున్నప్పటికీ మద్దతు ధరలు మాత్రం నామమాత్రం గానే పెంచడం వలన రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని అయిన ఆవేదన వ్యక్తం చేశారు. తద్వారా వ్యవసాయం ద్వారా సరైన , ఆదాయం రాక ఇంకా పేదరికంలోనే సన్నీ చిన్న కారు రైతులు మగ్గుతున్నారని పేర్కొన్నారు. ఇలాంటి రైతులను ప్రభుత్వమే ఆదుకోవాలని ఈ సందర్భంగా రైతు కూలి సంఘం అధ్యక్షులు కామ్రేడ్ దైవ సహాయం డిమాండ్ చేశారు. బిఅర్ఎస్ ప్రభుత్వం రైతులకు ఇచ్చిన హామీ మేరకు లక్ష లోపు రుణ మాఫీ చేయాలనీ, వరి ధాన్యం అమ్ముకున్న రైతులకు 2 నెలలు గడుస్తున్న వారి ఖాతాలో డబ్బులు వేయకపోవడం బాధాకరని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా రైతుల ఖాతాలో డబ్బులు జామచే యాలని వారు అన్నారు .ఈ కార్యక్రమంలో మండల నాయకులు ఎం నాగయ్య,బి. బుచ్చన్న,వాసరి సాయినాథ్,బొల్లారం దాస్, సాయిలు, రైతులు పాల్గొన్నారు.