రైతాంగ సమస్యల పరిష్కారం కోసం ఏఐకేఎస్ అలుపెరుగని పోరు

– తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర నాయకులు పుల్లయ్య
నవతెలంగాణ – అశ్వారావుపేట
దేశవ్యాప్తంగా రైతులు ఎదుర్కొంటున్న సమస్య పరిష్కారం కోసం అలుపెరుగని పోరాటం చేసేది ఏ ఐ కె ఎస్  మాత్రమేనని తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర నాయకులు కొక్కెరపాటి పుల్లయ్య అన్నారు. గురువారం నియోజక వర్గం కేంద్రం అయిన అశ్వారావుపేట పరిధిలోని పేరాయిగూడెం పంచాయితీ నెహ్రూ నగర్ లో అఖిలభారత కిసాన్ సభ (ఏ ఐ కె ఎస్ ) 89 వ, ఆవిర్భావ దినోత్సవం సంఘం మండల బాధ్యులు తగరం జగన్నాధం అద్యక్షతన ఘనంగా నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన పుల్లయ్య  సంఘం పతాకాన్ని ఆవిష్కరించిన అనంతరం మాట్లాడుతూ  1936 ఏప్రిల్ 11 న   వలస పాలన కు , భూస్వామ్య పీడనకు, కంపెనీ వ్యవసాయ కు  వడ్డీ వ్యాపారుల దోపిడీ కి  వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా పెల్లుబికిన రైతుల పోరాటం సంఘటిత పరిచే క్రమం లో  ఉత్తర ప్రదేశ్ లక్నో వేదికగా అఖిల భారత కిసాన్ సభ ఆవిర్భావం జరిగింది అని అన్నారు.సాగు దారులకు భూములు పై హక్కు డిమాండ్ ను జాతీయ డిమాండ్ గా మార్చింది ఈ సంఘమే అని అన్నారు.ప్రపంచ ఖ్యాతిని పోందిన తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం,బెంగాల్ తెభాగ రైతాంగ పోరాటం,కేరళ ఉన్నప్ప వాయిలార్ రైతాంగ పోరాటం,మహారాష్ట్ర వర్లీ ఆదివాసీ గిరిజన రైతాంగ పోరాటాల్లో అఖిల భారత కిసాన్ సభ భాగస్వామి అన్నారు.ప్రస్తుత దేశం లో కార్పొరేట్ వ్యవసాయం కు వ్యతిరేకంగా జరుపుతున్న పోరాటం లో అఖిల భారత కిసాన్ సభ ముఖ్య భాగస్వామి అని అన్నారు.ఈ కార్యక్రమంలో రైతు సంఘం మండల నాయకులు నార్లపాటి దశరధయ్య,కలపాల భద్రం,రవిబాబు తదితరులు పాల్గొన్నారు.