అమరావతి: టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబుకు ఊరట లభించింది. స్కిల్ కేసులో ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఆయనకు రెగ్యులర్ బెయిల్‌ను సోమవారం మంజూరు చేసింది. ఆగస్ట్ 9న స్కిల్ కేసులో చంద్రబాబు అరెస్ట్ అయిన సంగతి తెలిసిందే. అక్టోబర్ 31న ఆరోగ్య సమస్యలతో నాలుగు వారాలు మధ్యంతర బెయిల్ జారీ చేసింది. ఇప్పుడు రెగ్యులర్ బెయిల్ ఇచ్చిన నేపథ్యంలో, చంద్రబాబు ఈ నెల 28న రాజమండ్రి జైలుకు వెళ్లనక్కర్లేదని హైకోర్టు స్పష్టంచేసింది. మధ్యంతర బెయిల్ సమయంలో విధించిన షరతులు ఈ నెల 28 వరకే వర్తిస్తాయని వివరించింది. చంద్రబాబు నవంబరు 29 నుంచి రాజకీయ సభలు, ఇతర కార్యక్రమాల్లో పాల్గొనవచ్చని హైకోర్టు పేర్కొంది. అయితే ఈ నెల 30న చంద్రబాబు విజయవాడలో ఏసీబీ కోర్టులో హాజరు కావాలని ఆదేశించింది. తన చికిత్సకు సంబంధించిన నివేదికను ఏసీబీ కోర్టుకు సమర్పించాలని స్పష్టం చేసింది.