నవతెలంగాణ – కంఠేశ్వర్
నిజామాబాద్ పోలీస్ కమీషనర్ కల్మేశ్వర్ సింగెనవార్, ఐ.పి.యస్ ఆదేశాల మేరకు గురువారం నిజామాబాద్ కమీషన రేటు కార్యాలయంలో నిజామాబాద్ అదనపు డి.సి.పి (అడ్మిన్) బి.కోటేశ్వర రావు ఐలమ్మ 129 వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా ముందుగా చాకలి ఐలమ్మ ఫోటోకు పూలమాలలు వేసిన అనంతరం అదనపు డి.సి.పి మాట్లాడుతూ.. తెలంగాణ సాయుధ పోరాటంలో ఐలమ్మ ప్రదర్శించిన ధైర్యసాహసాలు. ప్రజాస్వామిక పోరాటాలకు స్ఫూర్తిగా నిలిచాయని, భూమి కోసం, భుక్తి కోసం, వెట్టిచాకిరి నుంచి విముక్తి కోసం సాగిన తెలంగాణ సాయుధ పోరాటంలో ఐలమ్మ ప్రదర్శించిన తెగువ, పౌరుషం తెలంగాణ ఆస్తిత్వాన్ని, ఆత్మగౌరవాన్ని చాటి చెప్పాయని పేర్కోన్నారు. ఈ జయంతి సందర్బంగా ఆఫీస్ సూపరింటెండెంటులు శంకర్, బషీర్, పోలీస్ కార్యాలయం సిబ్బంది సి.సి.ఆర్.బి సిబ్బంది సి.ఎస్.బి సిబ్బంది, ఐ.టి కోర్ సిబ్బంది, పోలీస్ కంట్రోల్ రూమ్ సిబ్బంది, సెంట్రల్ కాంప్లెంటు సెల్ సిబ్బంది పాల్గొన్నారు.