నవతెలంగాణ – భువనగిరి
చిట్యాల ఐలమ్మ, మల్లు స్వరాజ్యం గారి స్ఫూర్తితో పోరాడి సాధించుకున్న హక్కులను కాపాడుకుందామని ఐద్వా రాష్ట్ర అధ్యక్షురాలు అరుణ జ్యోతి తెలిపారు. మంగళవారం యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి పట్టణ కేంద్రంలోని ఉద్యోగుల భవనంలో ఐద్వా జిల్లా 3వ మహాసభలు జిల్లా అధ్యక్షురాలు కవ్వారు రామేశ్వరి అధ్యక్షతన నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్ర ఐద్వా రాష్ట్ర అధ్యక్షురాలు అరుణ జ్యోతి హాజరై మాసవిల ప్రారంభంగా సూచికంగా జండా ఆవిష్కరణ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మహిళలపై అనేక దాడులు జరుగుతున్నాయన్నారు. అదేవిధంగా హింసకు గురవుతున్నారన్నారు. అధికారంలోకి వస్తే ఏటా రెండు కోట్ల ఉద్యోగాన్ని ఇస్తామని హామీ ఇచ్చారు. కానీ అవి ఏమీ నెరవేరలేదన్నారు. అన్ని సంస్థలను ప్రైవేటీకరణ చేయడం అనేది జరిగింది, బీజేపీ ప్రభుత్వం మహిళల హక్కులను హరించేస్తున్నదన్నారు. మనుధర్మ శాస్త్రాన్ని అమలు చేస్తుందన్నారు. మహిళల దుస్తుల కారణంగా అత్యాచారానికి గురవుతున్నారని మోడీ ప్రభుత్వం చెప్తుందన్నారు. భక్తిమయంలో ఉంచి వారిని రాజకీయంగా ఎదగకుండా, వాళ్ళ కుర్చీలను కాపాడుకుంటున్నారని విమర్శించారు. మహిళలు వార్తలు విని రాజకీయ పరిస్థితులను గురించి అవగాహన పెంచుకోవాలన్నారు. కేసీఆర్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేర్చనందుకు కాంగ్రెస్ అధికారంలోకి రావడం జరిగిందన్నారు. ప్రజాపాలన పేరుతో వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ఆరు గ్యారంటీ ఇచ్చింది. ఆరు గ్యారెంటీలు అమలు చేయకుండా కాలయాపన చేస్తున్నదన్నారు. మహిళలకు ఇస్తానన్న రూ.2500 రూపాయలు ఇవ్వకుండా కాలయాపన చేసి ఉచితంగా గ్యాస్ కి సబ్సిడీ ఇస్తున్నానని చెప్పి, ఇప్పటివరకు అమలు చేయలేదని అన్నారు. నిత్యవసర ధరలు విపరీతంగా పెరుగుతున్నాయి అన్నారు. మల్లు స్వరాజ్యం చాకలి ఐలమ్మ స్ఫూర్తిని తీసుకొని మహిళలు పోరాటాలకు కదలి రావాలని అన్నారు. ఈ కార్యక్రమంలో ఐద్వా జిల్లా కార్యదర్శి బట్టుపల్లి అనురాధ, జిల్లా ఉపాధ్యక్షురాలు దోనూరు నిర్మల,సహాయ కార్యదర్శి మల్లెపల్లి లలిత, కోశాధికారి కల్లూరి నాగమణి, బత్తుల జయమ్మ కేసు రెడ్డి జయమ్మ, రేష్మ ,మాయరాణి, ఆవుల కలమ్మ,గోపమ్మ,వసంత పాల్గొన్నారు.