ఐలమ్మ సాహసమే తెలంగాణ సమాజానికి స్ఫూర్తి

– రాష్ట్ర విద్యుత్‌ శాఖ మంత్రి జగదీశ్‌రెడ్డి
నవతెలంగాణ-సూర్యాపేటకలెక్టరేట్‌
తెలంగాణ సాయుధపోరాటంలో బడుగు, బలహీన వర్గాల హక్కుల కోసం నిలబడిన వీరనారి చాకలి ఐలమ్మ అని రాష్ట్ర విద్యుత్‌ శాఖ మంత్రి గుంటకండ జగదీశ్‌రెడ్డి అన్నారు.చాకలి ఐలమ్మ 128వ జయంతి సందర్భంగా సూర్యాపేట కలెక్టరేట్‌లో ఆమె చిత్రపటానికి పూలమాలలేసి నివాళులర్పించారు.ఈ సందర్భంగా మంత్రి మాట్లాడారు.ఐలమ్మ సాహసమే తెలంగాణ సమాజానికి స్ఫూర్తి అన్నారు.సైదా పోరాటంలో ఆమె చూపించిన తెగువ ప్రపంచంలోనే తెలంగాణకు గుర్తింపు తెచ్చిందని కొనియాడారు.తమ హక్కుల కోసం కొట్లాడే వారికి ఆమె జీవితం స్ఫూర్తిదాయకం అన్నారు.ఆ స్ఫూర్తితోనే రాష్ట్రంలో కేసీఆర్‌ పాలన కొనసాగుతుందన్న మంత్రి ఆ యోధురాలి స్పూర్తితో సాగుతున్న కేసీఆర్‌ పాలన ద్వారా అమలు చేసిన అభివద్ధి సంక్షేమ పథకాలు దేశంలో తెలంగాణను నెంబర్‌వన్‌గా నిలబెట్టాయన్నారు.జీవితంలో ఎదురయ్యే ప్రతి సమస్యలో ఐలమ్మ పోరాట స్ఫూర్తితో అధిగమించాలన్నారు.కేసీఆర్‌ హయాంలోనే తెలంగాణ పోరాటయోధులకు సముచిత గౌరవం లభించిందన్న మంత్రి, ఐలమ్మ ఆశయాలను నెరవేర్చడమే ఆమెకు మనమంతా ఇచ్చే అసలైన నివాళి అని అన్నారు.ఈ కార్యక్రమంలో ఎంపీ బడుగుల లింగయ్యయాదవ్‌,కలెక్టర్‌ వెంకట్రావ్‌, అడిషనల్‌ కలెక్టర్‌ ప్రియాంక,జిల్లా గ్రంథాలయ చైర్మెన్‌ నిమ్మల శ్రీనివాస్‌గౌడ్‌, మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ పెరుమాళ్ల న్నపూర్ణమ్మ, జెడ్పీటీసీ జీడి భిక్షం, బీఆర్‌ఎస్‌ రాష్ట్ర కార్యదర్శి,కార్మిక సంఘం నేత వై.వీ, బీసీ కుల సంఘాలు, తదితరులు పాల్గొన్నారు.
మునగాల : చాకలి ఐలమ్మ జీవితం చరిత్రలో చిరస్మరణీయమని సీపీఐ జిల్లా నాయకులు సీహెచ్‌.సీతారాం అన్నారు.మండల కేంద్రంలోని స్థానిక చిల్లంచర్ల రఘునాథం స్మారక భవన్‌ లో ఐలమ్మ 124వ జయంతి ఉత్సవాలు నిర్వహించారు.ఈ కార్యక్రమంలో సీపీఐ పట్టణ కార్యదర్శి జక్కుల వీరశేఖర్‌, సీపీఐ(ఎం) పట్టణ కార్యదర్శి గడ్డం వినోద్‌, ఏఐటీయూసీ మండల కార్యదర్శి సారెడ్డి రాఘవరెడ్డి, ఏఐవైఎఫ్‌ జిల్లా కౌన్సిల్‌ సభ్యులు కాసర్ల రాజేష్‌, డీవైఎఫ్‌ఐ మండల నాయకులు దేవరం శ్యా మ్‌, తోకల బద్రి,చింతకాయల ఎల్లయ్య నెమ్మాది శ్రీకాంత్‌, రజక సంఘం నాయకులు తంగేళ్ల మంగయ్య, గరిపాకుల సతీష్‌, ప్రభాకర్‌, సట్టు గోపి ,వీరబాబు, తంగేళ్ల శ్రీను, నాగరాజు పాల్గొన్నారు.