ఐలమ్మ పోరాట స్ఫూర్తి నేటి తరాలకు ఆదర్శం 

Ailamma's fighting spirit is a role model for today's generationsనవతెలంగాణ – కంఠేశ్వర్
ఐలమ్మ పోరాట స్ఫూర్తి నేటి తరాలకు ఆదర్శం అని బీసీ ఉపాధ్యాయ సంఘం జిల్లా అధ్యక్షులు మాడవేడి వినోద్ కుమార్ తెలిపారు. ఈ మేరకు గురువారం వీరనారి ఐలమ్మ జయంతి సందర్భంగా హనుమాన్ జంక్షన్ లోని ఆమె విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది. ఈ సందర్భంగా బిసి ఉపాధ్యాయ సంఘం జిల్లా అధ్యక్షులు మాడవేడి వినోద్ కుమార్ మాట్లాడుతూ ఐలమ్మ పోరాట స్ఫూర్తితో బిసి లకు జనాభా దామాషా ప్రకారం రిజర్వేషన్లు అమలు చేసేవరకు పోరాటం కొనసాగిస్తామని, ప్రభుత్వం బిసి ల కుల గణన ను వెంటనే చేపట్టాలని డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో బిసి ఉపాధ్యాయ సంఘం నాయకులు రామకృష్ణ, కొట్టూరు రమేష్, రమణ స్వామి తదితరులు పాల్గొన్నారు.