ఐలమ్మ జీవితం అందరికి స్ఫూర్తి

Ailamma's life is an inspiration to allనవతెలంగాణ – మల్హర్ రావు
తెలంగాణ వీరనారి చాకలి ఐలమ్మ జీవితం అందరికి స్పూర్తిని రజక సంఘం నాయకులు అన్నారు.ఐలమ్మ 129వ జయంతి వేడుకలు పురస్కరించుకుని గురువారం మండల కేంద్రమైన తాడిచెర్లలో రజక సంఘం ఆధ్వర్యంలో ఐలమ్మ విగ్రహానికి పూల మాలలు వేసి నివాళులర్పించారు.ఈ సందర్భంగా మాట్లాడారు నిజాం రాజుల నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా పోరాడి, స్వాతంత్ర్య సమరయోధురాలిగా ఆమె నిలిచారన్నారు. తెలంగాణ సాయుధ పోరాటంలో చాకలి ఐలమ్మ  ప్రస్థానం ఒక శక్తివంతమైన అధ్యాయమని తెలిపారు.తెలంగాణ ప్రజల ఆత్మగౌరవం కోసం అహర్నిశలు పోరాడారని,,భూస్వామ్యానికి చాకలి ఐలమ్మ ధైర్యం, త్యాగం, సంకల్పం ఈ తరం యువతకు ప్రేరణగా నిలుస్తాయన్నారు. ఐలమ్మ జయంతిని రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహించడంపై హర్షం వ్యక్తం చేశారు.ఈ కార్యక్రమంలో పైడాకుల సమ్మయ్య, కిరణ్,లక్ష్మయ్య,రాజేశం,రాచర్ల చందు,కనుకుల రాకెష్,చింటూ పాల్గొన్నారు.