విశ్వవిద్యాలయానికి ఐలమ్మ పేరు అభినందనీయం

– మాజీమంత్రి బస్వారాజ్‌ సారయ్య
నవతెలంగాణబ్యూరో-హైరదాబాద్‌
కోఠి మహిళా విశ్వవిద్యాలయానికి వీరనారి చిట్యాల ఐలమ్మ పేరు పెట్టడం అభినందనీయమని మాజీ మంత్రి బస్వారాజ్‌ సారయ్య చెప్పారు. గురువారం హైదరాబాద్‌లోని గాంధీభవన్‌లో ఐలమ్మ చిత్రపటానికి పూల మాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే వీరపల్లి శంకర్‌, సీనియర్‌ ఉపాధ్యక్షులు కుమార్‌రావు, కాంగ్రెస్‌ సీనియర్‌ నాయకులు బొల్లు కిషన్‌, ఫిషర్మెన్‌ కార్పొరేషన్‌ చైర్మెన్‌ మెట్టు సాయి కుమార్‌, జనరల్‌ సెక్రెటరీలు, రజక సంఘం రాష్ట్ర నాయకులు మిద్దె శ్రీనివాసులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.