నవతెలంగాణ – అశ్వారావుపేట
ఎఐపికెఎస్(అఖిల భారత ప్రగతి శీల రైతు సంఘం,ఎఐపికెఎంఎస్( అఖిల భారత ప్రగతి శీల వ్యవసాయ కార్మిక సంఘాల మండల స్థాయి నిర్మాణ సర్వసభ్య సంయుక్త సమావేశం శనివారం మండలంలోని దిబ్బ గూడెం పంచాయతీ దురద పాడు లో 2 వందల మందితో నిర్వహించారు.ఈ సమావేశాలకు అధ్యక్ష వర్గంగా ధర్ముల శ్రీరాములు,పండ ముత్యాలు,కంగాల కన్నయ్య, కంగాల వెంకటేష్ వ్యవహరించారు.ఈ సందర్భంగా ఎఐపికేఎంఎస్ అఖిల భారత ప్రగతి శీల వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు గోకినే పల్లి ప్రభాకర్,అఖిల భారత ప్రగతి శీల రైతు సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు కంగాల కల్లయ్య ,సిపిఐ యం యల్ ప్రజాపంథా అశ్వారావుపేట మండల కార్యదర్శి వాసం బుచ్చిరాజులు మాట్లాడుతూ.. దేశంలో రాష్ట్రంలో ప్రభుత్వాలు రైతు వ్యతిరేక, కూలీ వ్యతిరేక విధానాలు అమలు పర్చుకోవాలని, లేని పక్షంలో రైతులు, కూలీలు కలిసి పోరాటం చేపడుతామని అలాగే రైతులకు కల్తీ లేని విత్తనాలు ఎరువులు రైతులకు అందించాలని వారు డిమాండ్ చేసారు. అనంతరం ఈ సంఘాల నూతన మండల కమిటీలు ఏర్పాటు చేసుకున్నారు. అఖిల భారత ప్రగతి శీల రైతు సంఘం (ఎఐపికెఎన్) అధ్యక్షుడుగా పండ ముత్యాలు,కార్యదర్శిగా కంగాల కన్నయ్య, కోశాధికారిగా గొంది లక్ష్మణ్ రావు,అఖిల భారత ప్రగతి శీల వ్యవసాయ కార్మిక సంఘం (ఎఐపికెఎంఎస్) అధ్యక్షుడుగా కంగాల వెంకటేష్,కార్యదర్శిగా ధర్ముల శ్రీరాములు, కోశాధికారిగా పోట్ట మోహన్ ఎన్నికైనారు. రెండు సంఘాల సభ్యులు 18 మందితో నూతన మండల కమిటీలు ఎన్నికయ్యాయి. ఈ కార్యక్రమంలో పివైఎల్ మండల కార్యదర్శి కుంజ అర్జున్, పివైఎల్ మండల ఉపాధ్యక్షుడు కంగాల వెంకటేష్, దిబ్బ గూడెం సర్పంచ్ కుంజ లక్ష్మి, పి ఓ డబ్ల్యూ మండల నాయకురాలు పూసం శారధ,కొమరం లక్ష్మి తదితరులు పాల్గొన్నారు.