– 60+ అంతర్జాతీయ ఎగ్జిబిటర్లతో పాల్గొంటున్న 30 దేశాలు
గత మూడు దశాబ్దాలుగా 11 ఎడిషన్‌లను నిర్వహించి అద్భుత విజయం సాధించిన ఆల్ ఇండియా ప్లాస్టిక్స్ మ్యానుఫ్యాక్చరర్స్ అసోసియేషన్ (AIPMA) మరోసారి ‘ప్లాస్టివిజన్ ఇండియా 2023′తో మరింత ముందుకెళ్తోంది. ఈ ఐదు రోజుల ఈవెంట్ వ్యవధిలో సందర్శకుల సంఖ్యలో, అందించే వ్యాపారంలో మునుపటి రికార్డులన్నింటినీ బ ద్దలు కొట్టాలని భావిస్తోంది. ముంబైలోని బాంబే ఎగ్జిబిషన్ సెంటర్ (BEC)లో 2023 డిసెంబర్ 7 నుండి 11 మధ్య నిర్వ హించబడుతోంది, ‘ప్లాస్టివిజన్ ఇండియా 2023′ అనేది భారతదేశపు అతిపెద్ద ప్లాస్టిక్స్ ట్రేడ్ ఎగ్జిబిషన్ యొక్క 12వ ఎడిషన్, ఇది తయారీదారులు, కొనుగోలుదారులు, విక్రేతలు, తుది–వినియోగదారుల కోసం అసాధారణమైన వ్యాపార, నెట్‌వర్కింగ్, ఆలోచన భాగస్వామ్య అవకాశాలను అన్‌లాక్ చేయడానికి ఉద్దేశించబడింది.
1,25,000 చదరపు మీటర్ల విస్తీర్ణంలో ఉన్న ఎగ్జిబిట్ ప్రాంతంతో, ‘ప్లాస్టివిజన్ ఇండియా 2023′ విస్తృత శ్రేణి ప్లాస్టిక్ ఉత్పత్తు లు, ప్లాస్టిక్ పదార్థాలు, యంత్రాలు, అచ్చులు, సాంకేతికతలను ప్రదర్శించింది. ఇవి నేడు ప్రపంచ ప్లాస్టిక్ పరిశ్రమలో విప్లవా త్మక మార్పులు తెస్తున్నాయి. జర్మనీ, మలేషియా, దక్షిణ కొరియా, చైనా వంటి దేశాల నుంచే కాకుండా రిలయన్స్, హెచ్‌పి సిఎల్, ఐఒసిఎల్, జెఎస్‌డబ్ల్యు గ్రూప్ వంటి పెద్ద భారతీయ సంస్థలు కూడా ఈ ఈవెంట్ లో పాల్గొంటున్నాయి. ఈ కార్యక్రమం మంత్రిత్వ శాఖల ప్రతినిధులు, పరిశ్రమ అనుభవజ్ఞులు, వ్యవస్థాపకులు, వ్యాపారులు, పరిశ్రమ నిపుణులు, ప్రధాన దిగుమతిదారుల కేంద్రంగా మారింది. ఇది దేశం యొక్క అత్యంత ప్రభావవంతమైన ప్లాస్టిక్స్ ప్రదర్శనగా పరిగణించబడుతోంది, ఇది పరిశ్రమ వృద్ధిని సులభతరం చేయడంలో నిస్సందేహంగా కీలక పాత్ర పోషిస్తుంది.
ప్రారంభ వేడుకలో NEC- ప్లాస్టివిజన్ ఇండియా ఛైర్మన్ హర్పాల్ సింగ్, ది ఆల్ ఇండియా ప్లాస్టిక్స్ మ్యానుఫ్యాక్చరర్స్ అ సోసియేషన్ ప్రెసిడెంట్ మనీష్ దేధియా, NAB & GC ప్లాస్టివిజన్ ఇండియా ఛైర్మన్ అరవింద్ మెహతా, ప్లాస్టివిజన్ ఇండియా కో–ఛైర్మన్ డాక్టర్ అసుతోష్ గోర్, NEC, ప్లాస్టివిజన్ ఇండియా కో–ఛైర్మన్ చంద్రకాంత్ తురాఖియా మాట్లాడుతూ, “భారత ప్లాస్టిక్ పరిశ్రమలో అతిపెద్ద అత్యున్నత స్థాయి లాభాపేక్షరహిత సంస్థగా తన పాత్రలో AIPMA 1992లో కేవలం 40 మంది ఎగ్జిబిటర్లతో ప్రారంభమైన ‘ప్లాస్టివిజన్ ఇండియా‘కు రూపకల్పన చేసి, నిర్వహించింది. కొన్ని వేల మంది సందర్శకులు 1వ ఎడిషన్‌ను సందర్శించారు. ప్రస్తుతం ఇది తన దృష్టిని మారుస్తూ, ‘ప్లాస్టివిజన్ ఇండియా‘గా అతిపెద్ద ప్లాస్టిక్స్ ట్రేడ్ ఎగ్జిబిషన్‌గా రూపాంతరం చెందింది. 12వ ఎడిషన్ గతంలో కంటే పెద్దదిగా ఉంటుంది. దేశీయ, అంతర్జాతీయ ప్లాస్టిక్ పరిశ్రమలోని వివిధ స్థాయిల సంబంధితులను ఒకచోట చేర్చి, ‘ప్లాస్టివిజన్ ఇండియా 2023′, ‘సర్క్యులర్ ఎకానమీ‘ థీమ్ చుట్టూ నిర్మించబడింది. పరిశ్రమ గ్రీన్ క్రెడెన్షియల్స్‌ను మెరుగుపరిచే సుస్థిరదాయకమైన పద్ధతులు, పదార్థాలు, సాంకేతికతలను సందర్శకులకు పరిచయం చేస్తుంది. ఎగ్జిబిటర్లు, సందర్శకులకు విలువ ప్రతిపాదనను పెంచే అనేక ప్రత్యక్ష ఉత్పత్తి ఆవిష్కరణలు, సెమినార్‌లు, కాన్ఫరెన్స్‌లు, కన్సల్టేషన్ సెషన్‌లతో కొనుగోలుదారులు, విక్రేతలను ఒకచోట చేర్చే భారతదేశపు అతిపెద్ద ప్లాస్టిక్–కేంద్రీకృత వేదిక. ‘ప్లాస్టివిజన్ ఇండియా 2023′ భారతీయ సంస్థలు, పారిశ్రామికవేత్తలను కొత్త ఉత్పత్తులు, ప్రక్రియలు, సాంకేతికతలను ఆవిష్కరించడానికి ప్రోత్సహిస్తుందని, తద్వారా భవిష్యత్తులో ప్లాస్టిక్‌ల తయారీకి ప్రపంచ కేంద్రంగా భారతదేశాన్ని చేయవచ్చునని మేం విశ్వసిస్తున్నాం’’ అని అన్నారు.
హెచ్ పిసిఎల్–మిట్టల్ ఎనర్జీ లిమిటెడ్, ఎండీ, సీఈఓ, AIPMA 12వ ఎడిషన్ ప్లాస్టివిజన్ ఇండియా 2023 ప్రారంభోత్సవాని కి ముఖ్య అతిథిగా హాజరైన ప్రభ్ దాస్ మాట్లాడుతూ, “భారతదేశంలో ప్లాస్టిక్ పరిశ్రమ వృద్ధిలో ప్లాస్టివిజన్ ఇండియా 2023 ఒక ముఖ్యమైన మైలురాయిని సూచిస్తుంది. 1,500+ ఎగ్జిబిటర్‌లతో, కొత్త తయారీ పద్ధతులు, రీసైక్లింగ్ పెవిలియన్లు, కన్సల్టెంట్ క్లినిక్‌లు, జాబ్ & కెరీర్ ఫెయిర్స్, మెడికల్ పెవిలియన్‌లతో ఈ ప్రదర్శన కంపెనీలు తమ ఆవిష్కరణలను ప్రద ర్శించడానికి, కొత్త వ్యాపార అవకాశాలను అన్వేషించడానికి ఒక వేదికగా ఉపయోగపడుతుంది. భారతదేశంలో ప్లాస్టిక్ పరిశ్రమ పరివర్తన, దాని భవిష్యత్తును రూపొందించడంలో ఇది ప్రధాన పాత్ర పోషించడాన్ని చూసేందుకు నేను ఎదురుచూస్తున్నాను’’ అని అన్నారు.
AIPMA ఆన్‌సైట్ లేదా ఆన్‌లైన్ బ్రాండింగ్ కార్యక్రమాల ద్వారా పాల్గొనే ఎంఎస్ఎంఈలకు అనేక ప్రయోజనాలను అందించడం ద్వారా ప్లాస్టివిజన్ ఇండియా 2023 యొక్క 12వ ఎడిషన్‌కు రసాయనాలు & ఎరువుల మంత్రిత్వ శాఖ, కెమికల్స్ & పెట్రో కెమికల్స్ శాఖ, మైక్రో, స్మాల్ & మీడియం ఎంటర్‌ప్రైజెస్ మంత్రిత్వ శాఖ మద్దతు ఇస్తున్నాయి. అంతేగాకుండా, ‘ప్లాస్టివిజన్ ఇండియా‘ ప్లాస్టిక్ పరిశ్రమ నుండి ప్రీమియర్ పారిస్ ఆధారిత గ్లోబల్ అసోసియేషన్, ఎగ్జిబిషన్ పరిశ్రమ అథారిటీ అయిన యూఎఫ్ఐ ద్వారా ఆమోదించబడిన ఏకైక ట్రేడ్ ఫెయిర్ ఎగ్జిబిషన్‌గా గుర్తింపు పొందింది. ప్రపంచవ్యాప్తంగా పరిశ్రమ ఈవెంట్స్ కు సంబంధించి టాప్ 5 ప్లాస్టిక్స్ లో ఒకటిగా సరైన ర్యాంక్ పొందింది. AIPMA ‘ప్లాస్టివిజన్ ఇండియా 2023′ మునుపటి ఎడిషన్ యొక్క 2,29,000 మంది సందర్శకుల సంఖ్యను అధిగమించిందని అంచనా.