న్యూఢిల్లీ : టాటా గ్రూపునకు చెందిన ఎయిరిండియా 180 ఉద్యోగులను ఇంటికి పంపించింది. పొదుపు చర్యల్లో భాగంగా గత కొన్ని వారాల్లో నాన్ ఫ్లయింగ్ సిబ్బందిపై వేటు వేసింది. ఈ ఉద్యోగులు స్వచ్ఛంద పదవీ విరమణ పథకాలు, పునర్ నైపుణ్య అవకాశాలను వినియోగించు కోలేరని ఆ వర్గాలు తెలిపాయి.