– ఖాట్మండ్‌కు రూ.3,899తోనే ప్రయాణం
న్యూఢిల్లీ: టాటా గ్రూపునకు చెందిన ఎయిరిండియా శుక్రవారం ‘నమస్తే వరల్డ్ సేల్’ ఆఫర్‌ను ప్రకటించింది. దేశీయ రూట్లలో రూ.1799, అంతర్జాతీయ రూట్లలో రూ.3,899 టికెట్ ప్రారంభ ధరతో ప్రయాణిం చడానికి వీలుందని ఆ సంస్థ తెలిపింది. తక్కువ ధరకే విలాసవంతమైన ప్రయాణ అవకాశం కల్పిస్తున్నట్లు ఎయిరిండియా పేర్కొంది. ఈ ఆఫర్ సోమవారం (ఫిబ్రవరి 5) వరకూ అందుబాటులో ఉంటుందని తెలిపింది. ప్రయాణాన్ని శుక్రవారం నుంచి సెప్టెంబర్ 30 వరకు ఎంచుకోవడానికి వీలు కల్పించినట్లు పేర్కొంది. ఫస్ట్ కం, ఫస్ట్ సర్వ్‌డ్ బేసిస్ ప్రకారం పరిమిత ఆఫర్ అందుబాటులో ఉన్నట్లు ఎయిరిండియా పేర్కొంది. అమెరికా, కెనడా, బ్రిటన్, యూరోపియన్ యూనియన్, గల్ఫ్, మిడిల్ ఈస్ట్, ఆసియా పసిఫిక్, దక్షిణా సియా ప్రాంతాలకు వెళ్లే విమాన ప్రయాణికులకు ఈ ఆఫర్ వర్తిస్తుంది. భారత్ నుంచి సింగపూర్‌కు రూ.6,772కే ప్రయాణించడానికి వీలుంది. రిటర్న్ జర్నీతో కలిపి రూ.13,552గా నిర్ణయించింది. భారత్-అమెరికా వన్ వే రూ.31,956, రిటర్న్‌తో కలిపి రూ.54,376గా ప్రకటించింది. యూరప్ దేశాలకు రూ.22,283గా, గల్ఫ్ అండ్ మద్య ప్రాచ్యం దేశాలకు రూ.7,714, మెల్ బోర్న్‌కు రూ.29,441, ఖాట్మండుకు రూ.3,899తో ప్రయాణించవచ్చని పేర్కొంది.