– పారిస్‌లో ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్ల సమ్మె
– ఓర్లి విమానశ్రయంలో 70శాతం సర్వీసుల రద్దు
పారిస్ : ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్లు సమ్మెకు దిగడంతో శనివారం ఫ్రాన్స్‌లో విమానరాకపోకలు స్తంభించిపోయాయి.. పారిస్‌లోని ఓర్లీ విమానాశ్రయంలో 70 శాతానికి పైగా సర్వీసులను శని, ఆదివారాల్లో రద్దు చేస్తున్నట్లు ఫ్రెంచి పౌర విమానయాన శాఖ ప్రకటించింది. దీంతో శనివారం తెల్లవారు జామున 4 గంటల నుంచి ఆదివారం రాత్రి పొద్దుపోయేవరకు అన్ని కమర్షియల్ విమానాలు రద్దయినట్లు డీజీఏసీ అధికారులు తెలిపారు. వేతనాల, పని ఒత్తిడి వంటి సమస్యలపై యాజమాన్యాల నిర్లక్ష్య వైఖరిని వ్యతిరేకిస్తూ ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్లు ఈ సమ్మె చేపట్టారు. జులై 26 నుంచి పారిస్‌లో ఒలింపిక్స్ క్రీడలు ప్రారంభం కానున్నాయి. ఇందుకోసం ప్రపంచం నలుమూలల నుంచి పెద్ద సంఖ్యలో క్రీడాకారులు, అభిమానులు తరలిరానున్నారు. నెల రోజుల వ్యవధిలో ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్లు సమ్మె చేయడం ఇది రెండవసారి. ఫ్రాన్స్‌లో రెండో అతిపెద్ద లేబర్ గ్రూప్ యూఎన్‌ఎస్‌ఏ – ఐసీఎన్‌ఏ ఆధ్వర్యంలో ఈ సమ్మె జరుగుతోంది.