ఎయిర్టెల్ ప్రమాద భీమా చెక్కు అందజేత

నవతెలంగాణ – శంకరపట్నం
శంకరపట్నం మండల కేంద్రంలోని అంబేద్కర్ చౌరస్తా సమీపంలో ఎయిర్టెల్ బ్యాంక్ యాప్ అవగాహన సమావేశం నిర్వహించారు.ఈ సమావేశంలో కేశవపట్నం గ్రామానికి చెందిన మార్క అజయ్ గత సంవత్సరం రోడ్డు ప్రమాదంలో చనిపోయాడు.అతను ఎయిర్టెల్ బ్యాంక్ యాప్ చెల్లింపులు చేయడం ద్వారా ఎయిర్టెల్ సంస్థ ఉచిత ప్రమాద భీమా రూ.5 లక్షల చెక్కుని మృతుడి తల్లి మార్క సరోజనకు ఆదివారం సంస్థ ద్వారా అందజేశారు. ఈ సందర్భంగా సంస్థ ప్రతినిధులు మాట్లాడుతూ ఎయిర్టెల్ బ్యాంకులో  100 రూపాయలతో సేవింగ్స్ ఖాతా తెరిస్తే రూ.2 లక్షలు, రూ.250 ఖాతా కి  రూ.5లు ప్రమాద బీమా ఉంటుందని తెలిపారు. ఎయిర్టెల్ పేమెంట్ యాప్ ద్వారా ఆన్లైన్ పేమెంట్లు చేసే వారికి ఉచిత ప్రమాద బీమా సౌకర్యం ఉందని తెలిపారు. ఈ కార్యక్రమంలో  కరీంనగర్ జోనల్ మేనేజర్ మువ్వ నరేష్, వీర శంకర్, రాజు శంకర్, గ్రామ యువకులు తదితరులు పాల్గొని ఖాతాలు తెరిచారు.