
పెద్దవూర మండల కేంద్రంలో ఏఐఎస్ఎఫ్ 89వ వార్షికోత్సవాల సందర్బంగా ఏఐఎస్ఎఫ్ నాగార్జున సాగర్ డివిజన్ సమితి ఆధ్వర్యంలో నేడు జరిగే బాల, బాలికల కబడ్డీ క్రీడా పోటీలను విజయవంతం చేయాలని ఏఐఎస్ఎఫ్ నల్లగొండ జిల్లా ఉపాధ్యక్షులు రమావత్ శోభన్ బాబు పిలుపునిచ్చారు.సోమవారం మండల కేంద్రంలో మాట్లాడుతూ.. సుదీర్ఘ పోరాట చరిత్ర కలిగిన ఏఐఎస్ఎఫ్ వీరోచిత పోరాటం చేసి ఎంతో మంది అమరులయ్యారని తెలిపారు.తెలంగాణ సాయుధ పోరాటంలో సైతం క్రియాశీలకంగా పనిచేసినటువంటి దేశంలో మొట్టమొదటి విద్యార్థి సంఘం ఏఐఎస్ఎఫ్ మాత్రమేనని అన్నారు. చదువుతో పోరాడు, చదువుకై పోరాడు అనే నినాదంతో విద్యారంగ సమస్యల పట్ల పరిష్కార మార్గాన్ని చూపిస్తూ ముందుకు సాగుతుందని అన్నారు.