నవతెలంగాణ – డిచ్ పల్లి: అఖిల భారత విద్యార్థి సమైక్య ఏఐఎస్ఎఫ్ తెలంగాణ యూనివర్సిటీ సమితి ఆధ్వర్యంలో రూపొందించిన క్యాలెండర్ను మంగళవారం తెలంగాణ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ యాదగిరి రావు చేతుల మీదగా ఆవిష్కరించారు. అనంతరం ఏఐఎస్ఎఫ్ నిజామాబాద్ జిల్లా అధ్యక్షురాలు అంజలి మాట్లాడుతూ చదువు , పోరాడు అనే నినాదం తోనే ఏఐఎస్ఎఫ్ విద్యార్థి సంఘం ఆవిర్భవించి నిరంతరం విద్యార్థుల సమస్యలపై అధ్యయనం చేస్తూ పోరాటాలను నిర్వహిస్తుందని అన్నారు. ఈ కార్యక్రమంలో ఏఐఎస్ఎఫ్ తెలంగాణ యూనివర్సిటీ కన్వీనర్ సాయి కుమార్, కో కన్వీనర్లు చందు, సంజయ్ నాయకులు గౌతమ్, విజయ్ పాల్గొన్నారు.