పట్టణంలోని ఆర్యవైశ్య భవన్ కు ఆదివారం జరిగిన ఎన్నికలలో అధ్యక్షులుగా అయిత బాల్ రాజేశం ఎన్నికైనట్లు ఎన్నికల అధికారి వైకుంఠం తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రధాన కార్యదర్శిగా పోశెట్టి శ్రీకాంత్, కోశాధికారిగా గంప కృష్ణ మూర్తి, ఉపాధ్యక్షులుగా చింత ప్రసాద్, కొత్తూరు అశోక్, సహాయ కార్యదర్షులుగా జూలూరి శ్రీనివాస్, చకిలం రవి ఎన్నికైనట్లు తెలిపారు. ఎన్నికైన సభ్యులకు నియామక పత్రాలు అందించారు.