
శంకరపట్నం మండలం ముత్తారం గ్రామంలో ఏఐటీయూసీ భవన నిర్మాణ కార్మిక సంఘం నూతన కమిటీని కరీంనగర్ జిల్లా ప్రధాన కార్యదర్శి పిట్టల సమ్మయ్య, సమక్షంలో ఆదివారం నూతన కమిటీని ఎన్నుకున్నారు. అధ్యక్షులుగా నూనె రమేష్, కార్యదర్శిగా రేగుల కుమార్, కోశాధికారిగా పల్లె రమేష్, మరియు కార్యవర్గ సభ్యులు,ఆళ్ల ధనంజయ, పొన్నాల లక్ష్మణ్, మంద చంద్రమౌళి, బండారి భాస్కర్,కొలిపాక రాయలింగు, నూనె ఐలయ్య, నూనె సదయ్య, లేగల రాజయ్య, చంద్రయ్య,బండి చంద్రయ్య, కొలిపాక శంకర్, సుద్దాల చంద్రయ్య, నూనె సమ్మయ్య,లను ఎన్నుకున్నారు.ఈ సందర్భంగా పిట్టల సమ్మయ్య మాట్లాడుతూ, భవన నిర్మాణ కార్మిక సంఘం నూతనంగా ఏర్పడ్డ అధ్యక్ష కార్యదర్శులకు కార్యవర్గానికి మరియు సభ్యులకు అభినందనలు తెలుపుతూ కార్మికులు అందరూ కలిసికట్టుగా ఉండి సంఘాన్ని బలోపేతం చేయాలని అలాగే ప్రతి ఒక్కరు సంఘానికి కృషి చేయాలని సంఘంలోని సమస్యలు పరిష్కరించడానికి కార్మికులు ఒకతాటిపై ఉండాలని ఆయన అన్నారు.