సమస్యల పరిష్కారమే ఏఐటీయూసీ ధ్యేయం

Adilabadనవతెలంగాణ-నస్పూర్‌
సింగరేణిలో కార్మికుల సమస్యల పరిష్కారమే ధ్యేయంగా సింగరేణి కాలరీస్‌ వర్కర్స్‌ యూనియన్‌ (ఏఐటీయూసీ) పనిచేస్తుందని యూనియన్‌ డిప్యూటీ ప్రధాన కార్యదర్శిలు కందికట్ల వీరభద్రయ్య, ముస్కె సమ్మయ్య, బ్రాంచ్‌ కార్యదర్శి ఎస్కే బాజీ సైదా అన్నారు. శుక్రవారం శ్రీరాంపూర్‌ బ్రాంచ్‌ ఆధ్వర్యంలో ఎస్‌ఆర్‌పి-3 గనిని సందర్శించారు. ఈ సందర్భంగా కార్మికుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం మాట్లాడుతూ మ్యాన్‌ రైటింగ్‌ చైర్స్‌ రబ్బర్స్‌ సరిపడా సరఫరా కావడం లేదని, సరఫరా అయిన రబ్బర్స్‌ కూడా నాసిరకంగా ఉండడం వల్ల మ్యాన్‌ రైడింగ్‌ చైర్స్‌ సరిపడలేక కార్మికులు ఇబ్బందులకు గురవుతున్నారన్నారు. యాజమాన్యం ఎంతో ప్రతిష్టాత్మకంగా వాటర్‌ ప్యూరిఫైడ్‌లను గనులలో ఏర్పాటు చేసిందని, వాటి మెయింటెనెన్స్‌ కొరకు ఎన్యువల్‌ మెయింటెనెన్స్‌ కాంట్రాక్ట్‌(ఏఎంసీ) ద్వారా ప్యూరిఫైడ్స్‌ మరమ్మత్తులు చేసేవారని తెలిపారు. వెంటనే యాజమాన్యం స్పందించి మెయింటెనెన్స్‌ కాంట్రాక్ట్‌ని పునరుద్ధరించాలని డిమాండ్‌ చేశారు. ఈ కార్యక్రమంలో బ్రాంచ్‌ సహాయ కార్యదర్శి మోత్కూరి కొమురయ్య, ఫిట్‌ కార్యదర్శి మురళీచౌదరి, అంబాల రవి, కాంట్రాక్ట్‌ వర్కర్స్‌ యూనియన్‌ రీజియన్‌ కార్యదర్శి అప్రోజ్‌ఖాన్‌, నాయకులు రోమోజీ, కాజీపేట విక్కి పాల్గొన్నారు.