
నవతెలంగాణ- రెంజల్
రెంజల్ మండలంలోని ఖాతాదారులు కెనరా బ్యాంకు సేవలను సద్వినియోగం చేసుకోవాలని అసిస్టెంట్ జనరల్ మేనేజర్ శ్రీనివాస్ తెలిపారు. శుక్రవారం రెంజల్ మండల కేంద్రంలోని కెనరా బ్యాంక్ నూతన భవనాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతులు, విద్యార్థులు, డ్వాక్రా గ్రూపు మహిళలకు వివిధ రకాల రుణాలను అందజేయడం జరుగుతుందని, రుణాలను తీసుకున్న ఖాతాదారులు సక్రమంగా రుణాలను చెల్లించినట్లయితే మరికొందరికి రుణాలను ఇచ్చే అవకాశం ఉందన్నారు. ప్రారంభంలో డ్వాక్రా గ్రూప్ మహిళలకు 7:30 లక్షల నుండి 20 లక్షల వరకు నేడు రుణాలను అందిస్తున్నారని ఆయన పేర్కొన్నారు. ఖాతాదారులకు మేమున్నామని, బ్యాంకు అధికారులు వారికి భరోసా కల్పించాలన్నారు. రెంజల్ మండల కేంద్రంలో 1977లో సిండికేట్ బ్యాంకు ను ప్రారంభించగా నేటికీ 46 సంవత్సరాలు పూర్తయిందని వారు పేర్కొన్నారు. నేడు కెనరా బ్యాంక్ 20 లక్షల కోట్ల టర్నోవర్ లో ముందుకు సాగుతుందని ఆయన పేర్కొన్నారు. రెంజల్ మండలం కెనరా బ్యాంకు ద్వారా 77 కోట్లు ఖాతాదారులకు రుణాలు ఇవ్వగా, మరో ఐదున్నర కోట్ల బకాయిలు మిగిలాయని, ఖాతాదారులు రుణాలు తీసుకొని సక్రమంగా చెల్లించాలని ఆయన సూచించారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ ఎమ్మెస్ రమేష్ కుమార్, బియ్యం నితిన్, బోధన్ బ్యాంకు మేనేజర్ యోగేశ్వర్, నిజామాబాద్ బ్యాంక్ మేనేజర్ రత్నాకర్, మేనేజర్ సంతోష్, పెద్దలు మాజీ జెడ్పిటిసి జనార్దన్ రెడ్డి, భవన నిర్మాణ దాత నర్సారెడ్డి, సర్పంచ్ బైండ్ల రాజు, మాజీ ఎంపీటీసీ కిషోర్, గంగా గౌడ్, రఫిక్, ధనుంజయ్, గోపాల్ రెడ్డి, జనార్దన్ రెడ్డి, భాస్కర్ రెడ్డి, ఇన్చార్జ్ ఏబీఎన్ భాస్కర్, సిసి శివకుమార్, మండల సమైక్య అధ్యక్షురాలు లక్ష్మి, ఖాతాదారులకు డ్వాక్రా మహిళ అధ్యక్షురాలు సిఏలు, తదితరులు పాల్గొన్నారు..