అజ్మీరా దేవేందర్ జ్ఞాపకార్థం మండల స్థాయి కబడ్డీ టోర్నమెంట్

నవతెలంగాణ మల్హర్ రావు
మండలంలోని పెద్దతూండ్ల గ్రామ మాజీ సర్పంచ్ అజ్మీరా చంద్రు నాయక్ కుమారుడు అజ్మీరా దేవేందర్ నాయక్ స్మారక జ్ఞాపకార్థం మండల స్థాయి కబడ్డీ ఆటల పోటీలను గురువారం పిఏసిఎస్ చైర్మన్ ఇప్ప మొండయ్య, తాజా మాజీ ఎంపిపి చింతలపల్లి మలహల్ రావు ప్రారంభించారు. పోటిల్లో ఇరువురు జట్లు పోటీ పడగా అడ్వాలపల్లి గ్రామ అమిగోస్ టీమ్ ప్రథమ బహుమతి రూ.5,016, ద్వితీయ బహుమతి ఇదే గ్రామానికి చెందిన హనుమాన్ టీమ్ రూ.2,016 గెలుపొందారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ గ్రామశాఖ అధ్యక్షుడు అజ్మీరా రాజు నాయక్, సింగిల్ విండో డైరెక్టర్ బానోతు సమ్మక్క కిషన్ నాయక్, మాజీ సర్పంచ్ రాజు నాయక్, కాంగ్రెస్ నాయకులు అడ్వాల మహేష్, శ్రీనివాస్, మండల  రాహుల్, సమ్మయ్య పాల్గొన్నారు.