సేవాలాల్ సేన విద్యార్థి జిల్లా కన్వీనర్ గా అజ్మీరా నవీన్ నాయక్  

నవతెలంగాణ – మల్హర్ రావు
సేవాలాల్ సేన విద్యార్థి విభాగం భూపాలపల్లి జిల్లా కన్వీనర్ గా అజ్మీర నవీన్ నాయక్ ఏకగ్రీవంగా ఎన్నిక చేసినట్లుగా రాష్ట్ర అధ్యక్షుడు అంగోతు రాంబాబు సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ కార్యక్రమంలో జయశంకర్ భూపాలపల్లి జిల్లా అధ్యక్షులు భూక్యా సురేష్ నాయక్ గారికి సహకరించినందుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఈ సమావేశంలో జిల్లా అధ్యక్షులు భూక్యా సురేష్ నాయ క్ జిల్లా మహిళా అధ్యక్షురాలు శారదాబాయి , జిల్లా ప్రధాన కార్యదర్శి కీర్తి బాయ్, చిట్యాల మండల అధ్యక్షురాలు పార్వతి బాయ్, జిల్లా ప్రధాన కార్యదర్శి వాలు నాయక్, జిల్లా ఉపాధ్యక్షులు రాంసింగ్ నాయక్, జిల్లా కార్యదర్శి రాజు నాయ, కార్యదర్శి రమేష్ నాయక్, టౌన్ అధ్యక్షులు నాంగవత్ రాజేందర్, చిట్యాల మండల అధ్యక్షుడు లావుడియా  రాజు నాయక్ పాల్గొన్నారు.