నవతెలంగాణ- వలిగొండ రూరల్ : యువతకు క్రీడలు మానసిక ఉల్లాసానికి దోహదపడతాయని ఏ జె ఆర్ ఫౌండేషన్ అధినేత ఎలిమినేటి జoగా రెడ్డి అన్నారు. గురువారం మండలంలోని ఏదుళ్లగూడెం స్టేజి వద్ద ఏజేఆర్ ఫౌండేషన్ సౌజన్యంతో నిర్వహించిన మండల స్థాయి క్రికెట్ క్రీడల్లో గెలుపొందిన లింగరాజు పల్లి జట్టుకు మొదటి బహుమతి 15,116 నగదుతోపాటు షీల్డ్, ద్వితీయ బహుమతి పొందిన పహిల్వాన్ పురం జట్టుకు 10,116 నగదు తోపాటు షీల్డ్ బహుమతులు అందజేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ యువతకు క్రీడల వల్ల దేహ దారుఢ్యం పెంపొందుతుందని, క్రీడల వల్ల మానసిక ఉల్లాసం పెంపొందుతుందని, క్రీడల్లో గెలుపు ఓటములు సహజం అని, ప్రతి క్రీడా కారుడు గెలుపుకు కృషి చేయాలని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో ఏ జె ఆర్ ఫౌండేషన్ సభ్యులు, క్రీడాకారులు పాల్గొన్నారు.