నవ తెలంగాణ- వలిగొండ : రానున్న సార్వత్రిక ఎన్నికల్లో పైళ్ల శేఖర్ రెడ్డి గెలుపు కోరుతూ ఏజేఆర్ ఫౌండేషన్ అధినేత ఎలిమినేటి జంగారెడ్డి పహిల్వాన్ పూర్ గ్రామం నుండి మత్స్యగిరి గుట్ట వరకు పాదయాత్ర చేపట్టారు. పాదయాత్రలో భాగంగా టేకుల సోమారం, ఏదుళ్ళగూడెం, మాందాపురం, నాతాళ్ల గూడెం, అక్కంపల్లి చేరుకున్న క్రమంలో గ్రామాలలోని బీఆర్‌ఎస్ నాయకులు ఎలిమినేటి జంగారెడ్డికి ఘన స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో బీఆర్‌ఎస్ మండల పార్టీ అధ్యక్షుడు తుమ్మల వెంకట్ రెడ్డి, మాందాపురం సర్పంచ్ సోలిపురం సాగర్ రెడ్డి, కౌకుంట్ల సోమిరెడ్డి, దేశపాక మల్లేష్, ఎంపీటీసీ మోటే నరసింహ, మాజీ ఎంపీటీసీ ఉద్దగిరి భాస్కర్, కౌడే వీర మల్లయ్య, మోటె లింగస్వామి, ఉలిపే పాండు, శ్రీశైలం, అక్కంపల్లి గ్రామ శాఖ అధ్యక్షులు నిమ్మల శ్రీనివాస్, ఉపాధ్యక్షులు గుడిసె నరసింహ, శంకరి సురేష్ తదితరులు పాల్గొన్నారు.