– నియామక పత్రం అందిస్తున్న చెరుకు శ్రీనివాస్ రెడ్డి
నవతెలంగాణ-దుబ్బాక రూరల్
బేగంపేట గ్రామానికి చెందిన అన్నబోయిన చంద్రశేఖర్ ను అక్బర్ పేట- భుంపల్లి మండల ఫిషర్మేన్ గా నియమిస్తూ…. గురువారం దుబ్బాక నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి చెరుకు శ్రీనివాస్ రెడ్డి, ఫిషర్మెన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రేపాక తిరుపతిలతో కలిసి నియామక పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా చంద్రశేఖర్ చెరుకు శ్రీనివాస్ రెడ్డి, ఫిషర్మెన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు పాతూరు వెంకటస్వామి గౌడ్, మహిళ నాయకురాలు సుమలత, అశోక్, పంజా మహేందర్, ముమ్మ గౌడ్, నరసింహులు, సోషల్ మీడియా కోఆర్డినేటర్ గాజుల రమేష్, చందు గ్రామ అధ్యక్షుడు, వేల్పుల యాదగిరి ముదిరాజ్, వడ్ల ప్రభాకర్, అభిద్, తిప్పన బోయిన స్వామి, తదితరులు పాల్గొన్నారు.