
మండలంలోని గట్లకానీపర్తి గ్రామంలోని శ్రీరామదాసు భజన మండలి, శ్రీ వెంకటేశ్వర ధార్మిక భజన మండలి 30 మంది సభ్యులు ఆదివారం తిరుమల తిరుపతి దేవస్థానంలో హిందూ ధర్మ ప్రచార పరిషత్ ఆధ్వర్యంలో అఖండ హరినామ సంకీర్తనలు చేశారు. మాడవీధులలో హరినామ సంకీర్తనలు చేశారు. ఈ కార్యక్రమంలో భజన మండలి సభ్యులు బస్వోజు శ్రీనివాస్, అనంతుల శ్రీశైలం, గూడా రాఘవేంద్ర శర్మ, బొమ్మ కంటి చంద్రమౌళి, స్వామి, దామర బుచ్చయ్య, సంధ్యారాణి, లావణ్య, కరుణాకర్, సాంబయ్య పాల్గొన్నారు.