– నిజాంబాద్ జిల్లాకు లభించిన ప్రాధాన్యం రాష్ట్ర కోశాధికారిగా మూడ శ్రీనివాస్ (అమాస శీను) ఏకగ్రీవంగా ఎన్నిక
నవతెలంగాణ కంఠేశ్వర్
అఖిల భారతీయ అయ్యప్ప ధర్మ ప్రచార సభ జాతీయ సాధారణ సర్వసభ్య సమావేశాలు, తెలంగాణ రాష్ట్ర కార్యవర్గ ఎన్నికలు ఖమ్మంలో ఈనెల 27 28 తారీకుల్లో ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి సంస్థ జాతీయ అధ్యక్షులు అయ్యప్ప దాసు అధ్యక్షతన నిర్వహించడం జరిగింది. ఈ జాతీయ సర్వసభ్య సమావేశంలో వారు అధ్యక్ష ఉపన్యాసం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ఈ సంవత్సరం ఎనిమేలి దగ్గరలో గల నారాయణ తోడులో శబరిమల సీజన్ మరియు నెల పూజ సమయాల్లో అన్నదాన కార్యక్రమం నిర్వహించేందుకు కోసం శాశ్వత ప్రాతిపదికన అన్నదాన కేంద్రాన్ని నిర్మించనున్నట్లు తెలియజేశారు. ఇప్పటికే భూసేకరణ జరిగిందన్నారు. ఈ సాధారణ సర్వసభ్య సమావేశానికి తమిళనాడు, తెలంగాణ, కర్ణాటక, కేరళ మరియు ఆంధ్రప్రదేశ్ లో నుండి పెద్ద సంఖ్యలో అయ్యప్ప సభ్యులు విచ్చేసి వివిధ తీర్మానాలు చేయడం జరిగింది. అదేవిధంగా ప్రతి రెండు సంవత్సరాలకొకసారి నిర్వహించే తెలంగాణ రాష్ట్ర కార్యవర్గ ఎన్నిక కార్యక్రమం కూడా ఖమ్మం జరిగింది.
ఈ సందర్భంగా వివిధ జిల్లాల నుండి విచ్చేసిన అధ్యక్ష, కార్యదర్శులు, ఉపాధ్యక్షులు మరియు కార్యనిర్వాహక సభ్యులు తెలంగాణ రాష్ట్ర కార్యవర్గాన్ని ఎన్నుకోవడం జరిగింది. ఈ కార్యవర్గంలో రాష్ట్ర అధ్యక్షుడిగా ఖమ్మం జిల్లాకు చెందిన టీవీ పుల్లంరాజు రాష్ట్ర అధ్యక్షుడిగా, కార్యదర్శి బోధన్ కు చెందిన కర్కాసిద్దు మరియు కోశాధికారిగా నిజామాబాద్ కు చెందిన మూడ శ్రీనివాస్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఉపాధ్యక్షుడిగా మన నిజాంబాద్ కు సంబంధించిన ప్రముఖ అయ్యప్ప భక్తులు ఇంజనీర్ గంగాధర్ గురుస్వామి ఎన్నికయ్యారు. కోశాధికారిగా ఎన్నికైన మూడవ శ్రీనివాస్ మాట్లాడుతూ.. ఎరుమేలి సమీపంలో గల నారాయణ తోడులో త్వరలో నిర్మించ తలపెట్టిన శాశ్వత నారాయణ భవనానికి వీలైనంత ఎక్కువగా నిధులు సమీకరణలో సంస్థకు దగ్గరుండి సహకారాన్ని అందిస్తానని అయ్యప్పస్వామి ధర్మ ప్రచారం రాష్ట్రం మొత్తం జరిగేలాగా కృషి చేస్తానని అన్నారు. జిల్లా నుండి అఖిల భారతీయ అయ్యప్ప ధర్మ ప్రచార సభ రాష్ట్ర స్థాయిలో ఏకగ్రీవంగా ఎన్నికైన మూడో శ్రీనివాస్ కి ఇంజనీర్ గంగాధర్ కి కర్కాసిద్దు కి నిజాంబాద్ జిల్లా ఏపీ కార్యవర్గం తరఫున అభినందనలు మరియు ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ఈ కార్యక్రమంలో నేషనల్ వెబ్ మాస్టర్ మాడవేడి సుధాకర్, జిల్లా నిజాంబాద్ జిల్లా ఉపాధ్యక్షులు మక్తల్ మల్లేష్, కార్యదర్శి వంశిధర్ చౌదరి, కోశాధికారి గంగోని మధు, జాయింట్ సెక్రటరీ లక్ష్మణ్ , వాలంటరీ కమాండెంట్ రతన్ గురుస్వామి , కార్యవర్గ సభ్యుడు సంజీవంకర్ శంకర్ మరియు తదితరులు పాల్గొన్నారు.