ఎస్సీ వర్గీకరణ చట్టబద్ధతకై అఖిలపక్షాన్ని ఢిల్లీకి పంపాలి

– గుగ్గిళ్ళ వీరయ్య ఎమ్మార్పీఎస్ ఎం ఎస్ పి ములుగు జిల్లా ఇన్చార్జ్
నవతెలంగాణ-గోవిందరావుపేట : ఎస్సీ వర్గీకరణ చట్టబద్ధతకై అఖిలభాక్షాన్ని ఢిల్లీకి పంపాలని ఎమ్మార్పీఎస్ ఎంఎస్పి ములుగు జిల్లా ఇన్చార్జి గుగ్గిల వీరయ్య ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఆదివారం మండల కేంద్రంలో బిఆర్ఎస్ పార్టీ ములుగు జిల్లా అధ్యక్షులు కాకుల మారి లక్ష్మణ్ బాబు కి ఎస్సీల ఏబిసిడి వర్గీకరణ చట్టబద్ధతకై అఖిలపక్షాన్ని ఢిల్లీకి తీసుకువెళ్లాలని వినతి పత్రం అందజేయడం జరిగినది. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి  ఎమ్మార్పీఎస్ .ఎం ఎస్ పి ములుగు జిల్లా ఇన్చార్జి గుగ్గిళ్ళ వీరయ్య  మాట్లాడుతూ.. ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధన కోసం తెలంగాణ రాష్ట్ర సమితి ఏర్పడిన నాటి నుండి తెలంగాణ ఉద్యమం ఆపదలో ఉన్న ప్రతి సందర్భంలోనూ ఎమ్మార్పీఎస్ కేసీఆర్ కు అండగా ఉంది.
తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత తెలంగాణ రాష్ట్రంలోని సింగిల్ లార్జెస్ట్ క్యాస్ట్ గా మాదిగల జనాభా దాదాపు 13 శాతం కు పైగా ఉంది అయితే మాదిగల ఆకాంక్ష అయిన ఎస్సీ వర్గీకరణ పట్ల గౌరవ ముఖ్యమంత్రి వర్యులు కల్వకుంట్ల చంద్రశేఖర రావు  ఢిల్లీకి అఖిలపక్షాన్ని తీసుకెళ్లి ఎస్సీ వర్గీకరణ సాధిస్తామని అసెంబ్లీ సాక్షిగా హామీ ఇచ్చారు. అయితే ఐదు సంవత్సరాలు గడుస్తున్న ఎస్సీ రిజర్వేషన్లు వర్గీకరణ పై అఖిలపక్షాన్ని ఢిల్లీకి తీసుకు వెళ్లే విషయంలో కెసిఆర్ నిర్లక్ష్యం గానే ఉన్నారు. వర్గీకరణ పై పార్లమెంటులో భారత రాష్ట్ర సమితికి చెందిన పార్లమెంటు సభ్యులు పలుమార్లు ప్రశ్నించడం నిరసన తెలుపడం అభినందనీయం భారత రాష్ట్ర సమితి పార్లమెంటు సభ్యులు ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ అంశంపై పార్లమెంటులో మాట్లాడుతున్న ప్రతి సందర్భంలో వారి చిత్తశుద్ధిని గౌరవిస్తున్నాం. అయితే గౌరవ ముఖ్యమంత్రి గారు ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ విషయంలో చొరవ తీసుకునే విషయంలో ముందుకు రాకపోవడం మాకు విచారణ కలిగిస్తుంది అయితే సెప్టెంబర్ 18 నుండి 22వ తేదీ వరకు అత్యవసర పార్లమెంటు సమావేశాలు జరుగుతున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం కూడా అనేక బిల్లులను ఆమోదించుకునే అవకాశాలు కనిపిస్తున్న తరుణంలో ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ విషయంలో హామీలు నిలుపుకొని చిత్తశుద్ధి ప్రదర్శించాలని కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాల్సిన బాధ్యతను భారత రాష్ట్ర సమితి మరియు భారత రాష్ట్ర సమితి ఎంపీలు తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నాం.
ఈ కార్యక్రమంలో ఎం ఈ ఎఫ్ ములుగు జిల్లా సమన్వయకర్త నెమలి నరసయ్య మాదిగ ఎమ్మార్పీఎస్ జిల్లా కన్వీనర్ పుల్లూరి కరుణాకర్ మాదిగ మాదిగ మహిళా సమాఖ్య ములుగు జిల్లా ఇన్చార్జి వావిలాల స్వామి మాదిగ మాదిగ కళా మండలి ములుగు జిల్లా ఇన్చార్జి కల్లెపెల్లి రమేష్ మాదిగ గుగ్గిళ్ళ సురేష్ మాదిగ కర్నే గోపి మాదిగ తోకల రాంబాబు ఎనగందుల మొగిలి మాదిగ కోకిల సాంబయ్య. ఈదురు సైదులు మాదిగ పోలేపాక రాజేష్ మాదిగ. తదితరులు పాల్గొన్నారు.