అక్కినేని నాగార్జున రెండో తనయుడు అఖిల్ త్వరలోనే ఓ ఇంటివాడు కాబోతు న్నారు. జైనబ్ రవ్జీతో అఖిల్ నిశ్చితార్థం జరిగినట్టు సోషల్ మీడియా వేదికగా నాగార్జున తెలిపారు.
‘జైనబ్‌తో మా తనయుడి నిశ్చితార్థం జరిగిందని తెలియజేస్తున్నందుకు ఆనందిస్తున్నాం. కోడలిగా జైనబ్‌ను మా కుటుం బంలోకి ఆహ్వానిస్తున్నాం. కాబోయే దంపతులకు మీ ఆశీస్సులు కావాలి’ అని నాగార్జున పోస్ట్ పెట్టారు. అక్కినేని ఇంట ఇరు కుటుంబాలు, అతి కొద్ది మంది అతిథుల సమక్షంలో ఈ నిశ్చితార్థ వేడుక ఘనంగా జరిగిందని తెలిపారు. అయితే ఇంకా పెళ్ళి తేదీని ఖరారు చేయలేదన్నారు. ఢిల్లీకి చెందిన జైనబ్ థియేటర్ ఆర్టిస్ట్ మాత్రమే కాదు. సోషల్ మీడియా ఇన్‌ఫ్లూయెన్సర్ కూడా. రెండేళ్ళ క్రితం అఖిల్‌తో మొదలైన పరిచయం కాస్తా ప్రేమగా మారింది. ఇరు కుటుంబాల అంగీకారంతో త్వరలోనే ఒక్కటి కాబోతున్నారు. ఈ విషయాన్ని అఖిల్ సైతం సోషల్ మీడియా వేదికగా అభిమానులతో షేర్ చేసుకున్నారు. ఇదిలా ఉంటే, నాగార్జున పెద్ద కుమారుడు నాగచైతన్య, శోభిత వివాహం డిసెంబర్ 4వ తేదీన జరుగనుంది. ఇటువంటి తరుణంలోనే అక్కినేని ఇంట మరో శుభకార్యం జరగడంతో అక్కినేని అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తూ, సామాజిక మాధ్యమాల వేదికగా నాగచైతన్య, శోభిత, అఖిల్, జైనబ్‌కు శుభాకాంక్షలు తెలిపారు. నాగచైతన్య నటించిన ‘తండేల్’ సినిమా ఫిబ్రవరి 7వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది. అలాగే గతేడాది ‘ఏజెంట్’ సినిమాతో ప్రేక్షకుల ముందుకొచ్చిన అఖిల్ ప్రస్తుతం ఓ భారీ ప్రాజెక్ట్‌లో నటిస్తున్నారు. ఈ భారీ ప్రాజెక్ట్‌ను త్వరలోనే మేకర్స్ అధికారికంగా ప్రకటించనున్నారు.