వేములవాడ ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ ను వేములవాడ పట్టణ ముస్లిం కమిటీ అధ్యక్షుడు అక్రమ్ శుక్రవారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఇటీవల జరిగిన ముస్లిం పట్టణ కమిటీ ఎన్నికల్లో గెలుపొందిన మహమ్మద్ అక్రం హైదరాబాద్ లోని ఆది శ్రీనివాస్ నివాసంలో మర్యాదగాపూర్వకంగా కలిసి పూల మొక్క అందజేసి శాలువాతో సత్కరించారు. ఈ సందర్భంగా ప్రభుత్వ విప్ అక్రమ్ కు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా విప్ మాట్లాడుతూ పెండింగ్ లో ఉన్న షాది ఖానా పనులను త్వరలో చేపట్టి నిరు పేద ముస్లిం కుటుంబాలకు అందుబాటులోకి తేనున్నట్టు తెలిపారు.ఖబరస్థాన్, ఈద్గాల కు సీసీ రోడ్డు నిర్మించేందుకు కృషి చేయనున్నట్టు తెలిపారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలు అర్హులైన ముస్లింలకు చేరేలా చూస్తానని హామీ ఇచ్చారు. ముస్లిం మైనారిటీల సంక్షేమం కోసం తమ ప్రభుత్వం కట్టుబడి ఉందనీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో మరిన్ని సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టబోతున్నామని భరోసా కల్పించారు. ఈ కార్యక్రమంలో ముస్లిం నాయకులు మొహమ్మద్ షకీల్, షేక్ ఇంతియాజ్, షేక్ ఆసిఫ్ లు ఉన్నారు.