
హుస్నాబాద్ పట్టణంలో జరుగుతున్న నేషనల్ హైవే పనులలో ప్రమాదాలు జరగకుండా చర్యలు తీసుకొని, పనులలో వేగం పెంచాలని హుస్నాబాద్ మున్సిపల్ చైర్మన్ ఆకుల రజిత వెంకన్న అన్నారు. సోమవరం హుస్నాబాద్ మున్సిపల్ కార్యాలయంలో అధికారులతో మున్సిపల్ చైర్మన్ ఆకుల రజిత నేషనల్ హైవే పనులపై సమీక్ష సమావేశం నిర్వహించారు. నిన్న కురిసిన అకాల వర్షాలకు ప్రజలు చాలా ఇబ్బందులకు గురవుతున్నారని, కరెంటు పోల్లు ఇండ్లు కూలిపోయే అవకాశం ఉందని అధికారులతో చర్చించారు. ప్రాణం నష్టం జరిగే అవకాశం ఉన్నందున వర్షాకాలం కావున పనులు పై అశ్రద్ధ చేయకుండా ప్రజలకు ఇబ్బంది కలగకుండా పనులు త్వరగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు .ఈ కార్యక్రమంలో కమిషనర్ టి మల్లికార్జున్ , ట్రాన్స్కో ఏఈ కె శశిధర్ రెడ్డి , కౌన్సిలర్ వల్లపు రాజు, ఆకుల వెంకన్న, కోమటి సత్యనారాయణ, పున్న సది, ఐలేని శంకర్ రెడ్డి,యండి ఆయూబ్, నేషనల్ హైవే అధికారులు తదితరులు పాల్గొన్నారు.