– వరుసగా 28 మ్యాచుల్లో గెలుపుొ సౌదీ ప్రొ లీగ్
దుబాయ్: సౌదీ ప్రొ లీగ్‌లో అల్-హిలాల్ జట్టు ప్రపంచ రికార్డును నెలకొల్పింది. ఈ లీగ్‌లో వరుసగా 28మ్యాచుల్లో గెలుపొందిన జట్టుగా ఈ రికార్డును సాధించింది. సౌదీ ప్రొ లీగ్‌లో భాగంగా ఆసియా ఛాంపియన్స్ లీగ్ క్వార్టర్‌ఫైనల్లో అల్ హిలాల్ జట్టు 2-0తో అల్-ఇత్తిహాద్‌ను ఓడించింది. గతంలో 2016-17 సీజన్‌లో వేల్స్ ప్రిమియర్ లీగ్‌లో ఛాంపియన్ షిప్‌లో జార్జి జీసస్ జట్టు 27 మ్యాచుల్లో నెగ్గి రికార్డు నెలకొల్పింది. అంతకుముందు 44ఏళ్ల క్రితం 26మ్యాచుల్లో గెలిచిన అజాక్స్ ఆమ్‌స్టర్‌డామ్ రికార్డును జీసస్ జట్టు ఎనిమిదేళ్ల క్రితం బ్రేక్ చేయగా.. తాజాగా అల్-హిలాల్ జట్టు ఆ రికార్డును చెరిపేసింది. ఫుట్‌బాల్ చరిత్రలోనూ గతంలో ఏ జట్టు వరుసగా 28మ్యాచుల్లో గెలుపొందిన దాఖలాలు లేవు. ఇక సౌదీ లీగ్‌లో జీసస్ జట్టు 65పాయింట్లతో అగ్రస్థానంలో ఉండగా.. స్టార్ ఆటగాడు క్రిస్టియానో రొనాల్డో ప్రాతినిధ్యం వహిస్తున్న అల్-నాసర్ జట్టు కంటే 12పాయింట్ల ఆధిక్యతలో ఉంది. 2022 రన్నరప్ అల్-హిలాల్‌తో సెమీస్‌లో అల్-ఐన్ జట్టు తలపడనుంది.