ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అటు ప్రభాస్ ఫ్యాన్స్ ఇటు ప్రేక్షకుల ఎదురు చూపులకు ఎట్టకేలకు హోంబలే ఫిల్మ్స్ తెరదించుతూ, ‘సలార్ పార్ట్ 1 సీజ్ ఫైర్’ రిలీజ్ డేట్‌ని అనౌన్స్ చేసింది. ప్రభాస్, ప్రశాంత్‌నీల్ కాంబోలో తెరకెక్కిన ఈ చిత్రాన్ని క్రిస్మస్ కానుకగా డిసెంబర్ 22న ప్రపంచ వ్యాప్తంగా భారీ స్థాయిలో రిలీజ్ చేయనున్నట్టు మేకర్స్ తెలిపారు. ఈ నేపథ్యంలో ఈ చితాన్ని క్రిస్మస్ కానుకగా రిలీజ్ చేయనుండటంతో ప్రభాస్ ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు. ఇక రిలీజ్ డేట్ పోస్టర్‌ను చూసిన ఆయన ఫ్యాన్స్ పూనకాలతో ఊగిపోతున్నారు. ఈ పోస్టర్‌లో ప్రభాస్ బీభత్సం సష్టించినట్టుగా కనిపిస్తోంది. ఒళ్లంతా రక్తంతో ప్రతినాయ కులను వేటాడి, వెంటాడినట్టుగా ఆయన చేతిలో కత్తిని చూస్తేనే ఇందులో ఎలాంటి యాక్షన్ సీక్వెన్స్ ఉండ బోతోన్నాయో అర్థం అవుతోంది. ఈ సినిమాలో ప్రభాస్ సరసన శృతిహాసన్ నటించింది.