నవతెలంగాణ మల్హర్ రావు
ఖమ్మం కెఎన్డి చారిట్రబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో హైదరాబాద్ లోని త్యాగరాయ గాన సభలో బుధవారం నిర్వహించిన జాతీయస్థాయి నృత్య ప్రదర్శన పోటీలు నిర్వహించారు. అందులో మండలంలోని ఆన్ సాన్ పల్లి గ్రామానికి చెందిన వర్ధమాన నృత్య కళాకారిణి కుమారి బానోత్ అలకనంద రాథోడ్ తన నృత్య ప్రదర్శనతో అందరిని ఆకట్టుకున్నారు. జాతీయస్థాయి లెజెండ్, సీతార్ రెండు అవార్డులకు ఎంపిక అవుతూ కార్యక్రమనికి ముఖ్య అతిధిగా హాజరైన ప్రముఖ తెలంగాణ సంఖ్య శాస్త్రావేత్త పద్మశ్రీ అవార్డు గ్రహిత దైవజ్ఞ శర్మ చేతుల మీదుగా అవార్డులను అందుకున్నారు. ఈ కార్యక్రమంలో కెఎన్డి ట్రస్ట్ చైర్మన్ చీమల కోటేశ్వరమ్మ, ప్రముఖ హాస్య నటుడు జబర్దస్త్ వెంకీ మంకీ, కవి గాయకులు ఎస్వీఆర్ వెంకటేష్, తెలంగాణ రాష్ట్ర సాంస్కృతిక కళాకారుల సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు బుర్రగడ్డ రవి కుమార్ గౌడ్, అవదానుల హరిప్రసాద్, భూపాలపల్లి జిల్లా సీనియర్ డాన్స్ మాస్టర్ అధ్యక్షులు దుర్గం రమేష్, ఎస్ సిసిఎల్ కొండి కుమార్, స్వర మధురిమ కల్చరల్ అకాడమీ ఖమ్మం అధ్యక్షులు ఇసనపల్లి నగేష్, సీనియర్ గాయకులు మల్లికార్జున్, చెరుకూరి రాజి, గోల్డ్ మ్యాన్ సూర్య భాయ్ తదితరులు పాల్గొన్నారు.