ఆంధ్రప్రదేశ్ ఎక్స్-రే సాంస్కృతిక శాఖ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో సోమవారం విజయవాడ హనుమంతరాయ గ్రంధాలయంలో జరిగిన మధర్ థెరిసా జన్మదిన వేడుకల్లో తన నృత్య ప్రదర్శనతో అందరిని ఆకట్టుకుని, కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హాజరైన కొమ్మెర్ల క్రిష్ణ వేణి విజయవాడ డిప్యూటీ కలెక్టర్,మాజీ మంత్రి శ్రీ నన్నపనేని రాజకుమారి, గద్దె అనురాధ జడ్పీ చైర్మన్ విజయవాడ, చేతుల మీదుగా మండలంలోని ఆన్ సాన్ పల్లి గ్రామానికి చెందిన కుమారి వర్ధమాన నృత్య కళాకారిణి బానోత్ అలకనంద నాట్య మయూరి అవార్డు అందుకున్నారు. కార్యక్రమంలో డిప్యూటీ కలెక్టర్, మాజీ మంత్రి,జెడ్పి చైర్మన్ మాట్లాడారు. భారత దేశానికి పుట్టినిల్లుగా పిలవబడే భరత నాట్యం ఎంతో ప్రాముఖ్యమైనది. చిన్నవయసులో అలకనందకు భరత నాట్యం పట్ల ఉన్నటువంటి శ్రద్ద,భక్తి, ఎంతో విలువైనది. అలాంటి నృత్యాన్ని ప్రదర్శన ఇస్తుంటే సాక్షాత్తు అమ్మవార్లే దిగివచ్చినట్లు ఉందని, భవిష్యత్ లో మరెన్నో జాతీయ అంతర్జాతీయ వేడుకల్లో పాల్గొని అవార్డులు రివార్డులు అందుకోవాలని కుమారి అలకనంద రాథోడ్ ని అభినందించారు. కార్యక్రమంలో ఎక్స్-రే సాంస్కృతిక శాఖ అధ్యక్షులు కొల్లూరి,మరియు సంస్థ నిర్వాహకులు, తల్లిదండ్రులు,మధర్ థెరిసా అవార్డు గ్రహీతలు,తదితరులు పాల్గొన్నారు.