స్వరమాలిక కల్చరల్ అకాడమీ ఆహ్వానం మేరకు వారి ఆధ్వర్యంలో ఈనెల 18న ఖమ్మం జిల్లాలోని ఎన్టిఆర్ పార్కు లకారం ట్యాంక్ బండ్ ప్రాంగణంలో విశ్వ విఖ్యాత, నట సార్వభౌమ, నటరత్న, పద్మశ్రీ, స్వర్గీయ శ్రీ నందమూరి తారకరామారావు 29వ వర్ధంతి జరిగింది. ఈ సందర్బంగా సంగీత విభావరి కార్యక్రమంలో మండలంలోని ఆన్ సాన్ పల్లి గ్రామానికి చెందిన వర్ధమాన నృత్య కళాకారిని కుమారి బానోత్ అలకనంద రాథోడ్ తనదైన శైలిలో నృత్య ప్రదర్శనలు ఇస్తూ అందరిని ఆకట్టుకుని కార్యక్రమానికి ముఖ్య అతిధిగా విచ్చేసినటువండి ఖమ్మం మున్సిపాలిటీ మేయర్ పూనుకొల్లు నీరజ చేతుల మీదుగా ఎన్టిఆర్ స్మారక పురస్కారాన్ని అందుకున్నారు. భవిష్యత్తులో మరెన్నో వేదికలపై అద్భుతమైన నృత్య ప్రదర్శనలు ఇస్తూ జాతీయ,అంతర్జాతీయ పురస్కారాలు అందుకోవాలని అలకనందను ప్రముఖులు అభినందించారు. ఈ కార్యక్రమంలో స్వరమాలిక కల్చరల్ అకాడమీ అధ్యక్షులు మన్నెపల్లి మల్లికార్జున్, ఆర్గనైజర్ ఇసనపల్లి నగేష్, ముకుంద చారిట్రబుల్ ట్రస్ట్ వ్యవస్థాపకులు చెరుకూరి రాజి, మరియు సీనియర్ గాయని గాయకులు వి.వి.రెడ్డి, గణపతి, స్వప్న, కీర్తన, ప్రసన్న పాల్గొన్నారు.