ఎక్స-రే లీటరరీ కల్చరల్ సర్వీస్ ఆర్గనైజేషన్ ఆంధ్రప్రదేశ్ ఆధ్వర్యంలో సోమవారం విజయవాడలో జరిగే మధర్ థేరిసా జయంతి సందర్బంగా మధర్ థేరిసా అవార్డు వేడుకల్లో మలహార్ మండలం ఆన్ సాన్ పల్లి గ్రామానికి చెందిన భరత నాట్య వర్ధమాన కళాకారిణి కుమారి అలకనంద రాథోడ్ తన నృత్య ప్రదర్శనని ప్రదర్శిస్తూ ప్రముఖుల చేతుల మీదుగా నాట్య మయూరి అవార్డుని అందుకోనున్నారని, చిన్నారి తల్లీ దండ్రులు ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. తమ కూతురు ఈ అవార్డ్ ఎంపికపై హర్షం వ్యక్తం చేస్తున్నట్లుగా పేర్కొన్నారు.