స్వర మధురిమ కల్చరల్ అకాడమీ ఖమ్మం సినీ విభావరి ఆధ్వర్యంలో జరిగిన జాతీయ స్థాయి నృత్య ప్రదర్శనలో భాగంగా మండలంలోని ఆన్ సాన్ పల్లి గ్రామానికి చెందిన భరతనాట్య వర్ధమాన నృత్య కళాకారిణి కుమారి బానోత్ అలకనంద రాథోడ్ తన నృత్య ప్రదర్శనతో సినీ గాయకులను, కవులను ఆకట్టుకుని నాట్య కిరణం అవార్డుకు ఎంపికవ్వడం చాలా సంతోషకరమైన విషయమని గ్రామస్తులు, బంధుమిత్రులు,తల్లీదండ్రులు హర్షం వ్యక్తం చేశారు.ఎంపిక అయిన అవార్డును ఈ నెల 6న ఆదివారం సాయంత్రం ఖమ్మం రామదాసు కళాక్షేత్రంలో అవార్డుల ప్రధానోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా హాజరవుతున్న తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ ఇన్ కామ్ టాక్స్ కమిషనర్ లావుడ్యా జీవన్ లాల్ చేతుల మీదుగా అందుకొనున్నట్లుగా అలకనంద తల్లిదండ్రులు తెలిపారు