ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో రూపొందిన సినిమా ‘హను-మాన్’. తేజ సజ్జ కథానాయకుడిగా నటించిన ఈ చిత్రాన్ని ప్రైమ్‌షో ఎంటర్‌టైన్‌మెంట్‌పై కె నిరంజన్ రెడ్డి నిర్మించగా, శ్రీమతి చైతన్య సమర్పించారు. సంక్రాంతి కానుకగా ఈనెల 12న విడుదలౌతుంది. ఈ నేపథ్యంలో ఈ సినిమాలో కీలక పాత్ర పోషించిన నటి వరలక్ష్మీ శరత్‌కుమార్ మీడియాతో మాట్లాడుతూ, ‘ప్రశాంత్ వర్మ ఈ కథ చెప్పినపుడు చాలా నచ్చింది. తప్పకుండా చేయాలనే ఫీలింగ్ కలిగింది. ఇందులో తేజకి అక్క పాత్రలో కనిపిస్తాను. బ్రదర్, సిస్టర్ మధ్య ఉండే సరదా సన్నివేశాలు మంచి వినోదాన్ని పంచుతాయి. చాలా క్యూట్‌గా ఉంటాయి. ప్రేక్షకులు చాలా బాగా కనెక్ట్ అవుతారు. ఇది సూపర్ హీరో ఫిల్మ్. ఇందులో తేజ సూపర్ హీరో. నేను కూడా ఒక యాక్షన్ సీక్వెన్స్ చేశాను. ఒక మాస్ హీరోకి ఉన్నంత ఎలివేషన్ వుండే యాక్షన్ సీక్వెన్స్ అది. సినిమా చాలా అద్భుతంగా వచ్చింది. దర్శకుడు ఎంత అద్భుతంగా కథ చెప్పారో అంత అద్భుతంగా సినిమా తీశారు. ఆడియన్స్ నుంచి చాలా పాజిటివ్ ఎనర్జీ వస్తోంది. తేజ, ప్రశాంత్, నిర్మాత ఈ సినిమా కోసం చాలా కష్టపడ్డారు. తప్పకుండా ఈ చిత్రం అద్భుతంగా అలరిస్తుందని ఆశిస్తున్నాను. వీరసింహారెడ్డి, క్రాక్, కోటబొమ్మాలి పీఎస్ చిత్రాల్లో నా పాత్రలకు గ్రే షేడ్ ఉంటుంది. హను-మాన్ లో చేస్తున్న అంజమ్మ పాత్ర కూడా భిన్నంగా ఉంటూ అందర్నీ కచ్చితంగా అలరిస్తుంది. ప్రీరిలీజ్ ఈవెంట్‌లో చిరంజీవి నన్ను అభినందించడం చాలా గొప్ప ఆనందాన్ని ఇచ్చింది. ఇన్నాళ్ళు పడిన కష్టానికి ఒక అవార్డ్‌లా అనిపించింది. ఆయనకు కతజ్ఞతలు తెలుపుతూ మెసేజ్ చేశాను’ అని తెలిపారు.