బాలకృష్ణ అభిమానిగా అలరిస్తా..

రాజ్‌ తరుణ్‌ హీరోగా ఎ.ఎస్‌.రవికుమార్‌ చౌదరి దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం ‘తిరగబడరసామీ’. మాల్వి మల్హోత్రా కథానాయికగా నటిస్తోంది. సురక్ష్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ మీడియా బ్యానర్‌ పై మల్కాపురం శివకుమార్‌ నిర్మిస్తున్నారు. త్వరలోనే సినిమా ప్రేక్షకులు ముందుకు వస్తోంది. ఈ నేపథ్యంలో హీరోయిన్‌ మాల్వి మల్హోత్రా మీడియాతో పలు విశేషాలను షేర్‌ చేసుకున్నారు. ‘మాది హిమాచల్‌ ప్రదేశ్‌. ముంబయిలో థియేటర్‌ ఆర్ట్స్‌ చేశా. టీవీ ఇండిస్టీ నుంచి నా కెరీర్‌ మొదలైంది. తర్వాత ఓ హిందీ ఫిల్మ్‌ చేసే ఛాన్స్‌ వచ్చింది. అలాగే ఒక మలయాళం, తమిళ్‌ సినిమా చేశాను. తెలుగులో తొలి సినిమా. ఈ సినిమాలో బాలకష్ణ అభిమానిగా కనిపిస్తా. చాలా ఎనర్జిటిక్‌ హైపర్‌ యాక్టీవ్‌ అమ్మాయిగా కనిపిస్తాను. నా క్యారెక్టర్‌ కారణంగానే కథ అంతా జరుగుతుంది. అలాగే నాకో యాక్షన్‌ సీక్వెన్స్‌ కూడా ఉంది. అది బాలకష్ణకి రిలేట్‌ అయ్యేలా ఉంటుంది. బాలకష్ణ మాట్లాడినప్పుడు ఫిల్టర్‌ ఉండదు. ఆయన మనసులో ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడేస్తారు. ఇందులో నా క్యారెక్టర్‌ కూడా అలానే ఉంటుంది. నా క్యారెక్టర్‌ మహిళలకు సెల్ఫ్‌ డిఫెన్స్‌ ప్రాముఖ్యతని నేర్పించేలా ఉంటుంది. డైరెక్టర్‌ రవికుమార్‌ చౌదరి చాలా మంచి విజన్‌ ఉన్న డైరెక్టర్‌. తను ఏదైతే చెప్పారో సరిగ్గా అదే ఎగ్జిక్యూట్‌ చేశారు. ఆయనతో వర్క్‌ చేయడం గ్రేట్‌ ఎక్స్‌పీరియన్స్‌. రాజ్‌ తరుణ్‌ క్యారెక్టర్‌ చాలా ఆసక్తికరంగా ఉంటుంది. సైలెంట్‌గా మొదలై వైలెంట్‌గా మారే క్యారెక్టర్‌. ఆడియన్స్‌ ఎంజారు చేసే అన్నీ ఎలిమెంట్స్‌ ఇందులో ఉన్నాయి’.