
నవతెలంగాణ -గోవిందరావుపేట
జాతీయ నులిపురుగుల దినోత్సవం సందర్భంగా ప్రభుత్వ ప్రయివేటు పాఠశాలల విద్యార్థులకు నులిపురుగుల నివారణకై ఆల్బెండజోలు మాత్రలు వేసినట్లు మండల ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ప్రధాన వైద్యాధికారి డాక్టర్ సుకుమార్ తెలిపారు. గురువారం మండల కేంద్రంలోని మెరిట్ ప్రైవేట్ పాఠశాల మరియు చల్వాయి మోడల్ పాఠశాలల్లోని విద్యార్థులకు ఆల్బెండజోళ్ మాత్రలు వేయడం జరిగిందని అన్నారు.తప్పనిసరిగా విద్యార్థులు ఈ మాత్రలు తీసుకోవాలని వీటివల్ల కడుపులో నులిపురుగులు ఉన్నట్లయితే చని పోయి బయటకు వస్తాయని అన్నారు. నులి పురుగులు ఉన్నట్లయితే కడుపులో అప్పుడప్పుడు నొప్పి రావడంతో పాటు బాల్యం ఎదుగుదలలో లోపం వచ్చే అవకాశాలు ఉంటాయని అన్నారు. ప్రతి సంవత్సరం తప్పనిసరిగా నులిపురుగుల మాత్రలను విద్యార్థులు తీసుకున్నట్లయితే ఆరోగ్యంగా ఎదగడానికి అవకాశం ఉంటుందని అన్నారు. ఈ కార్యక్రమంలో ఏఎన్ఎం లు రాజక్క లలిత సుజాత ఆశాలు అనిత సమత తదితరులు పాల్గొన్నారు.